Jagan: జగన్‌పై జనాల్లో తీవ్రస్థాయిలో అసహనం.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కొంప మునగడం ఖాయమా ?

ఇప్పటికైనా జగన్ అలర్ట్ కావాలి.. జనాలు ఆనందంగా ఉన్నారో, సంతోషంగా ఉన్నారో... అలా కనిపిస్తున్నారో అర్థం చేసుకోవాలి. లేదంటే.. వచ్చే ఎన్నికల్లో భారీ దెబ్బ పడడం ఖాయం అని మరికొందరు ఫ్యాన్‌ పార్టీ నేతలకు సూచిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - February 27, 2023 / 02:37 PM IST

2024 ఎన్నికల గురించి జగన్‌ తనకు తాను కొన్ని లెక్కలు వేసుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 50శాతం మందికి పైగా ఏదో రకంగా సంక్షేమ పథకాలు అందాయని.. ఆ ఓట్లు అన్నీ వైసీపీకే అని.. మళ్లీ విజయం ఖాయమనే కాన్ఫిడెన్స్‌… కాదుకాదు ఓవర్ కాన్ఫిడెన్స్‌లో కనిపిస్తున్నారు. అందుకే వైనాట్‌ 175 అంటూ.. క్లీన్‌స్వీప్ టార్గెట్‌గా పార్టీని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది వర్కౌట్ అవుతుందా అంటే.. అంత సీన్‌ లేదు కదా.. పైగా టీడీపీకి అది ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్.

ఏదైనా పనిని తాను చేయగలను అనుకోవడం కాన్ఫిడెన్స్‌.. తాను మాత్రమే చేయగలను అనుకోవడం ఓవర్‌ కాన్ఫిడెన్స్.. అటు ఇటుగా జగన్ పరిస్థితి.. రెండో దానికి దగ్గర్లో ఉంది అన్నట్లుగా కనిపిస్తోంది. వచ్చిన నంబర్‌.. రావాలి అనుకుంటున్న నంబర్‌ చూసుకొని మురిసి పోతున్నారు తప్ప.. జనాలు ఏమనుకుంటున్నారనే విషయం జగన్‌ పట్టించుకోవడం లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. ఆ విషయాలను జనాల దగ్గరకు తీసుకెళ్లే వారు లేరా అన్న సంగతి ఎలా ఉన్నా.. ఇదే వచ్చే ఎన్నికల్లో వైసీపీ కొంప ముంచే అవకాశాలు కనిపిస్తున్నాయ్. జగన్ మీద, జగన్ సర్కార్ మీద జనాల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి మొదలైంది. నెమ్మదిగా అది అసహనానికి దారి తీస్తోంది. జనాలకు ఎన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నది మ్యాటర్ అయినా.. జనాలకు వారి కళ్లముందు ఏం జరుగుతుందన్నది ఇంకా ముఖ్యం. అలాంటి వాటిని పట్టించుకోవడంలో వైసీపీ సర్కార్ విఫలం అయిందనే చర్చ ఉంది. రోడ్లు లేవ్‌.. రాజధాని లేదు.. పోలవరం సంగతి సరేసరి ! సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు ఇలా ఇచ్చి.. ఖర్చుల రూపంలో అలా తీసుకెళ్తున్నారనే టాక్ ఉంది. మండుతున్న ధరలు.. ఎండుతున్న బతుకులు.. ఏపీలో చాలామంది పరిస్థితి ఇదే !

ఇలాంటి పరిణామాలతో జనాల్లో జగన్ సర్కార్ మీద అసహనం మొదలైంది. ఇది వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఇదేం కర్మ అంటూ టీడీపీ మొదలుపెట్టిన కార్యక్రమానికి జనం ఆ స్థాయిలో భారీగా రావడమే ఎగ్జాంపుల్.. జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారో చెప్పడానికి ! దాదాపు అన్ని వర్గాల్లో వైసీపీ మీద ఏదో ఒకరకంగా అసంతృప్తి మొదలైందనే చర్చ జరుగుతోంది. ఇదే 2024లో జగన్‌ను, వైసీపీని దెబ్బతీయడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. విపక్షంలో ఏ పార్టీ ఉన్నా సరే… సానుభూతి ఫ్యాక్టర్ బాగా వర్కౌట్ అవుతుంది. ఐతే టీడీపీకి ఇప్పుడా అవసరం లేదు. సానుభూతికి మించి.. జగన్ సర్కార్ మీద అసంతృప్తి, అసహనం టీడీపీకి ప్లస్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. లోకేశ్ యాత్రకు రెస్పాన్స్‌, ఇదేం కర్మను ఆపేందుకు జరుగుతున్న ప్రయత్నాలు.. ఇవే విషయాలు చెప్తున్నాయన్నది మరో వర్గం మాట !

ఇప్పటికైనా జగన్ అలర్ట్ కావాలి.. జనాలు ఆనందంగా ఉన్నారో, సంతోషంగా ఉన్నారో… అలా కనిపిస్తున్నారో అర్థం చేసుకోవాలి. లేదంటే.. వచ్చే ఎన్నికల్లో భారీ దెబ్బ పడడం ఖాయం అని మరికొందరు ఫ్యాన్‌ పార్టీ నేతలకు సూచిస్తున్నారు.