తెలంగాణా ప్రజలకు భారీ ముప్పు, ఈ రోగాలు తప్పవా…?

దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సీజన్ ఇప్పుడు ఐసీయూలో ఉన్న పేషెంట్ లకు మాత్రమే అందే పరిస్థితి కనపడుతోంది. క్రమంగా ఢిల్లీలో కాలుష్య తీవ్రత పెరుగుతూ అక్కడి ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం ఉందని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - November 1, 2024 / 07:00 PM IST

దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సీజన్ ఇప్పుడు ఐసీయూలో ఉన్న పేషెంట్ లకు మాత్రమే అందే పరిస్థితి కనపడుతోంది. క్రమంగా ఢిల్లీలో కాలుష్య తీవ్రత పెరుగుతూ అక్కడి ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం ఉందని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. చలికాలం పూర్తిగా ఎంటర్ కాకముందే అక్కడి ప్రజలకు గాలి అందడం చాలా కష్టంగా మారుతోంది. రోజు రోజుకి పరిస్థితి అత్యంత దారుణంగా మారుతోంది. దీపావళికి బాణసంచ వినియోగంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) మరింత దారుణంగా పడిపోయింది.

ప్రస్తుతం 398 వద్ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కొనసాగుతోంది. ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించినా లెక్కచేయని ఢిల్లీ ప్రజలు పెద్ద ఎత్తున దీపావళి వేడుకలు జరిపారు. ఫలితంగా కాలుష్యం పెరగడంతో పాటు… క్షీణిస్తున్న గాలి నాణ్యత భయపెడుతోంది. అత్యధికంగా ఆనంద్ విహార్ లో 386, నెహ్రు నగర్ లో 368, వివేక్ విహార్ లో 353, ఆర్కే పురంలో 376, నార్త్ క్యాంపస్ ఢిల్లీ యూనివర్సిటీలో 353, అశోక్ విహార్ లో 363, వాజిర్పూర్ లో 363 గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అయితే ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ లో ఢిల్లీ సరసన చేరుతోంది హైదరాబాద్. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు తెలంగాణా జిల్లాలు కూడా అదే స్థాయిలో చేరుతున్నాయి. తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అత్యంత దారుణంగా పడిపోతుంది. తెలంగాణలో టాప్ లో వరంగల్ 143గా ఉండగా…హనుమకొండ 130 తరువాత హైదరాబాద్ 128 ఉన్నాయి. సంవత్సరంలో సగానికి పైగా రోజులు ఇదే స్థాయిలో గాలి నాణ్యత ఉంటోంది. హైదరాబాదులో పారిశ్రామిక ప్రాంతాలైన మేడ్చల్ లో 126, జీడిమెట్ల లో 116, పటాన్ చెరువులో 114, సనత్ నగర్ లో 125, రాజేంద్రనగర్లో 124 స్థాయిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది.

వరంగల్ 143 హనుమకొండ 130 హైదరాబాద్ 128 నల్గొండ 119 కరీంనగర్ 116 నిజామాబాద్ 115 భువనగిరి 113 మిర్యాలగూడ సూర్యాపేట 112 జగిత్యాల 111 పెద్దపల్లి 106గా ఉంది. 50% దాటితే చెడుగాలిగా పరిగణ, 50 నుంచి 100 మధ్య గాలి నాణ్యత ఉంటే ముందు నుంచి 150, 150 నుంచి 200 మధ్య అనారోగ్యకరం 200 దాటితే ప్రమాదకరం 300 దాటితే అత్యంత ప్రమాదకరంగా పరిగణిస్తారు. ఆస్తమా, బ్రాంకైటీస్ కళ్ళ మంటలు శ్వాసకోస వ్యాధులు ఇలాంటి సమస్యలతో పాటు హార్ట్ పేషెంట్లకు ఇబ్బందులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

దీపావళి తర్వాత అటు ఢిల్లీలో ఇటు హైదరాబాదులో మరింతగా గాలి నాణ్యత స్థాయి పడిపోయింది. దీనితో ఇప్పుడు ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉంది. వాహనాల వినియోగం తగ్గించాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. ఇతర రవాణా మార్గాలను అన్వేషించాలని, బాణా సంచా వంటి వాటిని కాల్చడం మానుకుంటే మంచిది అని హెచ్చరిస్తున్నారు. సిటీ బస్ లు, మెట్రో, లోకల్ ట్రైన్స్ వంటి వాటిని వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు.