సజ్జల భార్గవ్ దగ్గర డ్రైవర్ గా పని చేస్తున్న సుబ్బారావును అక్రమంగా అరెస్టు చేసారని… సజ్జల భార్గవ్ పై ఫాల్స్ కేసులు పెట్టారంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. సజ్జల భార్గవ్ దగ్గర పని చేస్తున్న డ్రైవర్ ను నిన్న ఉదయం అరెస్టు చేసారన్న ఆయన భార్గవ్ ఎక్కడ ఉన్నాడో చెప్పాలని డ్రైవర్ సుబ్బారావును అరెస్టు చేసారని మంకి క్యాప్ వేసి డ్రైవర్ సుబ్బారావును చితక బాదారన్నారు. సుబ్బారావును రెండున్నర తరువాత విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ దగ్గర వదిలేశారని ఆయన ఆరోపించారు.
సజ్జల భార్గవ్ ను అరెస్టు చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని… భార్గవ్ ను అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో బతుకు దెరువు కోసం వచ్చిన డ్రైవర్ ను పోలీసులు దారుణంగా కొట్టారని మండిపడ్డారు. విచారణ పేరుతో సుబ్బారావుపై దాడి చేసిన వాళ్లపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసారు. విధులు అతిక్రమించి ప్రవర్తించిన పోలీసులపై ప్రవేట్ కేసులు పెడతామని హెచ్చరించారు. సుధా రాని,గౌతం రెడ్డి,రవీంద్ర రెడ్డిపై కేసులు పెట్టీ దాడులు చేస్తున్నారన్నారు. ఫాల్స్ కేసులు పెట్టిన వాళ్లపై పోరాటం చేస్తామని హెచ్చరించారు.