Arvind Dharmapuri: పార్లమెంట్ ఎన్నికల వేళ.. తెలంగాణలో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయ్. ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కొందరు.. ఓటమికి కారణం అయిన వాళ్ల అంతు చూడాలని ఇంకొందరు.. ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవానికి.. పార్లమెంట్ ఎన్నికల్లో రివేంజ్ తీర్చుకోవాలని వ్యూహాలు సిద్ధం చేస్తున్న నాయకులు ఎందరో ! ఇలాంటి పరిణామాల మధ్య నిజామాబాద్‌లో ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
bandla ganesh : మరో వివాదం.. రూ.75 కోట్ల ఇంటిని కబ్జా చేశాడు
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీద బీజేపీ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కి టికెట్ ఇవ్వొద్దంటూ మెట్‌పల్లి, కోరుట్లలో కరపత్రాలు పంపిణీ చేశారు బీజేపీ అసమ్మతి నేతలు. మెట్‌పల్లి, కోరుట్లలో న్యూస్ పేపర్‌లలో కరపత్రాలను పంచేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కి టికెట్ ఇవ్వొద్దంటూ ఆ పాంప్లెట్‌లలో రాసి ఉంది. కరపత్రాలపై నలుగురు వ్యక్తుల పేర్లు ముద్రించి పంచేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కి టికెట్ ఇవ్వొద్దంటూ చెప్తూనే.. కండ్లకు పెట్టుకున్న కూలింగ్ అద్దాలు తీయడు.. జనాలను చూడడు.. కారు నుంచి దిగడు.. జనాలతో మాట్లాడడని అందులో రాసుకొచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ధర్మపురి అరవింద్ ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి రెడీ అవుతున్నారు.
ఈ తరుణంలో అరవింద్ మీద బీజేపీ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. వారం రోజుల కిందట బీజేపీ కార్యకర్త సతీష్.. అరవింద్‌కి టికెట్ ఇవ్వొద్దంటూ రోడ్డుపైన నిరసన వ్యక్తం చేశారు. ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. ఇప్పుడీ కరపత్రాలు వైరల్ కావడంతో.. నిజామాబాద్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయ్.