ARVIND KEJRIWAL VS KAVITHA: కవిత VS కేజ్రీవాల్.. వన్ టు వన్‌కు సిద్ధమవుతున్న ఈడీ

ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఈడీ కస్టడీలో ఉన్నారు. దాంతో ఇద్దర్నీ ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ చేయబోతున్నారు అధికారులు. ఈడీ కస్టడీలో కవిత సెకండ్ ఇన్నింగ్స్ ఢిల్లీ లిక్కర్ కేసులో అత్యంత కీలకం కానుంది.

  • Written By:
  • Publish Date - March 23, 2024 / 04:21 PM IST

ARVIND KEJRIWAL VS KAVITHA: ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎపిసోడ్‌లో ఇప్పుడు కీలకఘట్టం స్టార్ట్ అవుతోంది. ఎమ్మెల్సీ కవితను మరో మూడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. దాంతో ఇకపై కవితతో ఈ స్కామ్‌లో ఇతర నిందితులతో one to One (వన్ టు వన్‌)లు స్టార్ట్ చేయబోతున్నారు అధికారులు. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఈడీ కస్టడీలో ఉన్నారు. దాంతో ఇద్దర్నీ ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ చేయబోతున్నారు అధికారులు.

MEKA SHARAN: ఎవరీ మేకా శరణ్ ? కవిత బంధువా.. లిక్కర్ కేసులో కొత్త పేరు

ఈడీ కస్టడీలో కవిత సెకండ్ ఇన్నింగ్స్ ఢిల్లీ లిక్కర్ కేసులో అత్యంత కీలకం కానుంది. ఇప్పటికే వారం రోజుల పాటు కవితను విచారించినా.. తమకు సరైన సమాచారం రాలేదని అంటున్నారు ఈడీ అధికారులు. అంతేకాకుండా సమీర్ మహేంద్రుతో కలిపి కవితను ప్రశ్నించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో కవిత కస్టడీ గడువు పొడిగించాలని కోరారు. దీనికి అనుమతించిన రౌస్ అవెన్యూ కోర్టు.. కవితకు మూడు రోజుల కస్టడీ పొడిగించింది. దీంతో మరో మూడు రోజులు కవిత ఈడీ కస్టడీలోనే ఉంటారు. అటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఈనెల 28 దాకా అదే ఆఫీసులో ఉంటారు. అందుకే కేజ్రీవాల్‌తో పాటు సమీర్ మహేంద్రుతో కూడా కలిపి కవితను ప్రశ్నించే అవకాశాలున్నాయి. వీళ్ళే కాకుండా మరికొందరు నిందితులతోనూ కలిపి వన్ టు వన్ ఇంటరాగేషన్ చేసేందుకు కోర్టు అనుమతించింది.

లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు ఎమ్మెల్సీ కవితనే కీలకమని ఈడీ భావిస్తోంది. లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూప్ నుంచి కవిత కింగ్ పిన్‌గా వ్యవహరించగా.. పాలసీని తయారీ, అమలు బాధ్యతల్లో కేజ్రీవాల్ కీ రోల్ పోషించారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటిదాకా ఇద్దర్నీ విడివిడిగా ప్రశ్నించిన అధికారులు కొంత వరకూ సమాచారం రాబట్టారు. అయితే ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ చేస్తే.. లిక్కర్ కేసు క్లైమాక్స్‌కి వస్తుందని అనుకుంటున్నారు. క్రాస్ చెక్‌తో అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని ఈడీ భావిస్తోంది.