Assembly Elections: తెలంగాణ ఎన్నికల బరిలో ఎంతమంది..? అత్యధికంగా పోటీ చేస్తోంది ఇక్కడి నుంచే..

ఎన్నికల కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణ ఎన్నికల్లో మొత్తం 2,290 మంది పోటీ పడుతున్నారు. అత్యధికంగా ఎల్బీ నగర్‌లో 48 మంది పోటీ పడుతుండగా, అత్యల్పంగా బాన్సువాడ, నారాయణపేటల్లో ఏడుగురు చొప్పున పోటీలో ఉన్నారు.

  • Written By:
  • Publish Date - November 16, 2023 / 02:38 PM IST

Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది. దీంతో ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో ఎంత మంది పోటీలో ఉన్నారు.. ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది.. ఎవరెవరు పోటీలో ఉన్నారో క్లారిటీ వచ్చింది. ఎన్నికల కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణ ఎన్నికల్లో మొత్తం 2,290 మంది పోటీ పడుతున్నారు. అత్యధికంగా ఎల్బీ నగర్‌లో 48 మంది పోటీ పడుతుండగా, అత్యల్పంగా బాన్సువాడ, నారాయణపేటల్లో ఏడుగురు చొప్పున పోటీలో ఉన్నారు.

Vijayashanti: ఏం చేస్తున్నరో.. మీకైనా క్లారిటీ ఉందా రాములమ్మ..!

నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 608 మంది పోటీ నుంచి తప్పుకొన్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్‌, కామారెడ్డిలో అత్యధిక నామినేషన్లు దాఖలయ్యాయి. వారిలో స్వతంత్రంగా నామినేషన్ వేసిన చాలా మందితో బీఆర్ఎస్ నేతలు చర్చలు జరిపారు. దీంతో కొందరు నామినేషన్ ఉపసంహరించుకునేందుకు అంగీకరించారు. అలా అత్యధికంగా గజ్వేల్‌లో 70 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ అక్కడ 44 మంది అభ్యర్థులు పోటీలో ఉండటం విశేషం. ఎల్బీ నగర్ తర్వాత ఎక్కువ మంది పోటీలో ఉన్నది గజ్వేల్ నియోజకవర్గంలోనే. ఆ తర్వాతి స్థానం కామారెడ్డి, మునుగోడు. ఈ రెండు నియోజకవర్గాల్లో 39 మంది అభ్యర్థులు తుది పోరులో ఉన్నారు.

ఆ తర్వాత పాలేరులో 37 మంది, కోదాడలో 34 మంది, నాంపల్లిలో 34 మంది, ఖమ్మంలో 32 మంది, నల్గొండలో 31 మంది, కొత్తగూడెంలో 30 మంది, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో 10 మంది ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో పార్టీలన్నీ ప్రచారంపై దృష్టిపెట్టాయి. ఇప్పటికే పలు పార్టీలు ప్రజలకు వరాలు ప్రకటించగా.. శుక్రవారం కాంగ్రెస్, బీజేపీ తుది మేనిఫెస్టో విడుదల చేయబోతున్నాయి. బీజేపీ ప్రధానంగా బీసీలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించాల్సి ఉంది.