Athiq Ahamad: కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కాపాడిన అతీక్‌ అహ్మద్‌

అతీక్‌ అహ్మద్‌. ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఎక్కడా చూసినా ఈ పేరే వినిపిస్తోంది. అతన్ని చంపిన విజువలే కనిపిస్తోంది. దాదాపు 40 ఏళ్ల పాటు యూపీ నేర సామ్రాజ్యానికి కింగ్‌పిన్‌లా ఉన్న అతీక్ అహ్మద్‌ను ముగ్గురు వ్యక్తులు అంతా చూస్తుండగానే పోలీసుల సమక్షంలో దారుణంగా షూట్ చేసి చంపేశారు.

  • Written By:
  • Publish Date - April 19, 2023 / 12:45 PM IST

దాదాపు 14 రౌండ్రులు కాల్పులు జరిపారు. 17 ఏళ్లకే మర్డర్‌ చేసి మాఫియా డాన్‌లా ఎదిగిన అతీక్‌ గురించి, కాంగ్రెస్‌కు అతీక్‌ అహ్మద్‌కు ఉన్న సంబంధం గురించి ఇంటర్నెట్‌లో ఓ విషయం ట్రెండింగ్‌లో ఉంది. అణు ఒప్పందం విషయంలో అప్పట్లో యూపీఏ ప్రభుత్వానికి లెఫ్ట్‌ పార్టీలు తమ మద్దతును ఉపసంహరించుకున్నాయి. పార్లమెంట్‌లో యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చాయి. అప్పుడు ఎంపీగా ఉన్న అతీక్‌ అహ్మద్‌ ఓటు కాంగ్రెస్‌ పార్టీని గట్టెక్కించింది. అవిశ్వాస తీర్మానం నుంచి బయట పడేందుకు కాంగ్రెస్‌ పార్టీ చాలా గ్రౌండ్‌ వర్క్‌ చేసింది. అతీక్‌ అహ్మద్‌ను అప్పటికే సమాజ్‌వాద్‌ పార్టీ బహిష్కరించింది. పార్టీకి దూరంగా ఉన్నా ఎంపీగానే కొనసాగాడు అతీక్‌. దీంతో అతని ఓటు కాంగ్రెస్‌కు ప్లస్‌ అయ్యింది.

సమాజ్‌వాద్‌ పార్టీ మీద ఉన్న కోపంతో కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఓటు వేశాడు అతీక్‌. దీంతో అవిశ్వాస తీర్మానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ గట్టెక్కింది. ఇలా మన్మోహన్‌ సర్కార్‌ కూలకుండా అతీక్‌ కాపాడాడు. కానీ ఇప్పడు అతీక్‌ ప్రాణాన్ని కాంగ్రెస్‌ పార్టీ కూడా కాపాడలేకపోయింది. ఉమేష్‌ పాల్‌ మర్డర్‌ కేసులో పోలీసులు తనను ఎన్‌కౌంటర్‌ చేస్తారంటూ అతీక్‌ రీసెంట్‌గానే స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. సుప్రీం కోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశాడు. కానీ సుప్రీం కోర్టు మాత్రం పిటిషన్‌ను స్వీకరించలేదు. యూపీ ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తుందని చెప్పింది. కావాలంటే అలహాబాద్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని చెప్పింది. కానీ ఈ గ్యాప్‌లోనే అతీక్‌ను కొందరు వ్యక్తులు కాల్చి చంపేశారు. ఇలా నాలుగు దశాబ్ధాల అతీక్‌ నేర చరిత్ర ఒక్క బుల్లెట్‌తో కుప్పకూలింది.