బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్తి , కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాం.
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఎన్నికల్లో దుబ్బాక నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై సోమవారం మధ్యాహ్నం హత్యాయత్నం జరిగింది. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి లో ఓ పాస్టర్ కుటుంబాన్ని పరామర్శించి వెళ్తున్న ఆయనపై ఓ నిందితుడు కత్తితో దాడికి పల్పడ్డాడు. ఈ ఘటనలో కొత్త ప్రభాకర్ రెడ్డికి పొట్ట నుంచి తీవ్ర రక్తస్రావం జరగడంతో హాటాహుటీనా చికిత్స నిమిత్తం కార్యకర్తలు గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. తర్వాత నిందితుడిని స్థానికులు పట్టుకొని చితకబాదారు.
బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించిన సీఎం కేసీఆర్.
బీఆర్ఎస్ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజా తీర్పు ను ఎదుర్కోలేక భౌతిక దాడులకు, హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటని సీఎం అన్నారు. ఎన్నికల సమయంలో ఇటువంటి సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు బీఆర్ఎస్ నేతలకు కార్యకర్తలకు అధినేత పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై ఎవరు దాడులకు పాల్పడ్డా సహించేది లేదని సీఎం ఆగ్రహా వ్యక్తం చేశారు.కొత్త ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నియోజకవర్గాల పర్యటనలో ఉన్న సీఎం దుర్ఘటనపై మంత్రి హరీశ్ రావును సీఎం ఫోన్లోఆరా తీశారు. సీఎం ఆదేశాలతో మంత్రి హరీష్ రావు గజ్వేల్ ఆస్పత్రికి చేరుకొని.. ఎంపీ ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి అడిగి తెలుసుకున్నారు.
S.SURESH