BABU SAPATHAM : శపథం నేరవేర్చుకున్న బాబు

2021లో చంద్రబాబు చేసిన శపథం నిజమైమంది.. ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అన్నమాట ప్రకారమే సీఎంగానే శాసనసభలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఫలితాల వేళ బాబు శపథం తాలూకా వీడియోను టీడీపీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి. బాబు అనుకున్నది సాధించారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - June 5, 2024 / 04:14 PM IST

2021లో చంద్రబాబు చేసిన శపథం నిజమైమంది.. ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అన్నమాట ప్రకారమే సీఎంగానే శాసనసభలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఫలితాల వేళ బాబు శపథం తాలూకా వీడియోను టీడీపీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి. బాబు అనుకున్నది సాధించారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ.. ఆనాడు చంద్రబాబు చేసిన శపథం. 2021 నవంబర్ 19న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు చేసిన శపథం! ఇప్పుడు ఫలితాల వేళ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇది కౌరవ సభ.. గౌరవ సభ కాదు.. ఇలాంటి కౌరవ సభలో నేను ఉండను.. ప్రజలంతా నా అవమానాన్ని అర్థం చేసుకోమని కోరుతున్నా అంటూ అసెంబ్లీ నుంచి బాబు బయటకు వచ్చేశారు. తర్వాత టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పటి నుంచి చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. 2021లో శపథం చేసినట్లుగానే.. సరిగ్గా మూడేళ్ల తర్వాత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగుపెట్టబోతున్నారు.
ఫలితాల వేళ 2021 నవంబర్ 19నాటి ఈ ఘటనను టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. అసెంబ్లీలో చంద్రబాబు శపథం చేసి బయటకు వస్తున్న వీడియోను షేర్ చేస్తున్నారు. శపథం చేసి మరీ సీఎంగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని ఖుషీ అవుతున్నారు. ఆ రోజు చంద్రబాబు కంట కన్నీరు వచ్చేలా వైసీపీ నేతలు చేశారని.. ఆ ఘటనను తాము ఇప్పటికీ మర్చిపోలేమంటూ కొందరు ట్వీట్‌లు చేస్తున్నారు. దటీజ్ చంద్రబాబు.. అంటూ రీ ట్వీట్స్ పెడుతున్నారు. సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ… ఎవ్వరినీ అవమానించేలా చంద్రబాబు మాట్లాడలేదని గుర్తు చేస్తున్నారు. అధికారం ఉందని విర్ర వీగలేదనీ, అధికారం పోయినప్పుడు కుంగిపోలేదని టీడీపీ నేతలు అంటున్నారు. అసెంబ్లీలో వైసీపీ నేతలు మాట్లాడిన భాష చాలా నీచంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి చంద్రబాబు శపథం చేసినట్టుగానే ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అదే సంగతిని ప్రెస్ మీట్ లో కూడా గుర్తు చేశారు.

చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలంతా ఓడిపోయారు. ఆరోజు బాబు సభ నుంచి వెళ్ళిపోయాక అంబటి రాంబాబు, కొడాలి నాని అసభ్యపదజాలంతో తిట్టారు. మైక్ లేకుండా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, సుధాకర్ బాబు కూడా మాట్లాడారు. వీళ్ళల్లో సుధాకర్ బాబుకి ఈసారి టిక్కెట్ దక్కలేదు. మిగతా ఇద్దరూ ఓడిపోయారు.