జనసేన పార్టీలో చేరికలు మొదలవుతున్నాయి. ఇన్ని రోజులు చేరతారు అనుకున్న వాళ్ళు ఇప్పుడు చేరేందుకు సిద్దమవుతున్నారు. ఒక్కొక్కరిగా జనసేన కండువా కప్పుకునేందుకు సిద్దమవుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ముందు జనసేనలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు. కాని అది ఆలస్యం అవుతూ వచ్చింది. ఇటీవల పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన బాలినేని ఏ షరతులు లేకుండా జనసేన తీర్ధం పుచ్చుకోవడానికి సిద్దమయ్యారు. అలాగే సామినేని ఉదయ భాను కూడా పార్టీలో జాయిన్ అవుతున్నారు.
జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఇలాంటి నాయకులు కావాలి అనుకుంటున్న పవన్ కళ్యాణ్ మరికొందరు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు. నేడు సామినేని ఉదయ భాను జగ్గయ్యపేట నుంచి భారీగా అనుచరులు అభిమానులతో కలిసి జనసేనలో జాయిన్ కానున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి , పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ కూడా జనసేనలో జాయిన్ కావడానికి సిద్దమవుతున్నారు. తొలుత ఒంగోలు లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జనసేనలో చేరేందుకు సిద్ధమైన బాలినేనికి పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చారు.
మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరాలని జనసేన అధిష్టానం సూచించింది. భారీ ర్యాలీతో మంగళగిరి వెళ్లాలని బాలినేని సిద్ధమైనా, సింపుల్గా ఒకరిద్దరు రావాలని అధిష్టానం సూచించింది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత మంగళగిరిలో ఎలాంటి ఆర్భాటాలు జనసేనలో బాలినేని జాయిన్ అవుతున్నారు. ఇక బాలినేని రాకపై ఒంగోలులో టీడీపీ నేతలు సీరియస్ గా ఉన్నారు. జనసేన నేతలు ఏర్పాటు చేసే హోర్డింగ్స్ లో అసలు తమ ఫోటో గాని తమ అధినేత ఫోటోగాని వాడొద్దు అంటూ ఇప్పటికే సూచించారట. ఇటీవల కొన్ని ఏర్పాటు చేసినా వాటిని తొలగించారు. మరి బాలినేని చేరిక తర్వాత ఎలాంటి పరిస్థితి కూటమిలో ఏర్పడుతుందో చూడాలి. ఒంగోలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని బాలినేని భావించినా అధిష్టానం నో చెప్పింది.