పడవలు తొలగించడానికి బెలూన్లు, ఒక్కో బెలూన్ ఎంత బరువు మోస్తుందంటే…?

ప్రకాశం బ్యారేజ్ వద్ద కొట్టుకువచ్చిన పడవలను తొలగించేందుకు అధికారులు నానా కష్టాలు పడుతున్నారు. నిన్న రెండు భారీ క్రేన్లను ప్రకాశం బ్యారేజ్ పై ఉంచి తొలగించాలని చూసినా అది సాధ్యం కాదు. రెండు గంటల పాటు ప్రయత్నం చేసినా సరే అంగుళం కూడా కదలలేదు ఒక్క బోటు కూడా.

  • Written By:
  • Publish Date - September 11, 2024 / 01:10 PM IST

ప్రకాశం బ్యారేజ్ వద్ద కొట్టుకువచ్చిన పడవలను తొలగించేందుకు అధికారులు నానా కష్టాలు పడుతున్నారు. నిన్న రెండు భారీ క్రేన్లను ప్రకాశం బ్యారేజ్ పై ఉంచి తొలగించాలని చూసినా అది సాధ్యం కాదు. రెండు గంటల పాటు ప్రయత్నం చేసినా సరే అంగుళం కూడా కదలలేదు ఒక్క బోటు కూడా. దీనితో ఇప్పుడు అధికారులు ప్లాన్ బీకి రంగం సిద్దం చేసారు. ప్రకాశం బ్యారేజ్ వద్దకు వైజాగ్ నుంచి ఒక ప్రత్యేక బృందాన్ని తీసుకొచ్చారు. నీటి లోపల కు దిగి పడవలను ఆ బృందం కట్ చేస్తుంది.

పడవలను తీసే ప్రయత్నం చేసినా రాకపోవడంతో కట్ చేసి తీయాలని నిర్ణయం తీసుకున్నారు. నేటి సాయంత్రం లోపు వీటిని తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కట్ చేసిన అనంతరం ఎయిర్ బెలూన్స్ తో పడవలను తొలగించునున్నారు అధికారులు. మూడు పడవలు కలిపి ఉండడంతో తొలగించడానికి ఇబ్బందిగా మారిందని అధికారులు చెప్తున్నారు. 120 టన్నులు పైగా మూడు పడవలు ఉండడంతో తొలగింపుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాసేపటి క్రితమే ప్రకాశం బ్యారేజీకి డైవింగ్ టీం చేరుకుంది.

అండర్ వాటర్ కటింగ్ ఎక్విప్మెంట్ ను సిద్ధం చేసుకున్నారు. మూడు బోట్లు కటింగ్ చేయడానికి మూడు నాలుగు రోజులు పడుతుందని డైవింగ్ టీం చెప్తోంది. కట్ చేసిన బోట్లను ఒడ్డుకు చేరుస్తారు. పులిచింతల గేట్, బలిమెల ప్రాజెక్టు ల వద్ద పని చేసిన అనుభవం ఉన్న టీం కావడంతో ప్రభుత్వం వారికి ఆ బాధ్యత అప్పగించింది. 50 టన్నుల బరువు ఎత్తగలిగే భారీ క్రేన్లతో లేపేందుకు ప్రయత్నించినా కదలకపోవడంతో నేడు పడవలను తొలగించేందుకు ఎయిర్ బెలూన్లు వినియోగిస్తున్నారు. పడవలను నీటిలోనే కత్తిరించి, తొలగించేందుకు విశాఖ నుంచి 120 టన్నుల కెపాసిటీ కలిగిన ఎయిర్ బెలూన్లను తెప్పించారు.