నందిగం సురేష్ ఐ ఫోన్లు ఎక్కడ…? పోలీసులు ఏమంటున్నారు…?

ఎంపీ నందిగం సురేష్ బెయిల్ కొటేషన్ కొట్టివేయండి అంటూ మంగళగిరి పోలీసులు హైకోర్ట్ లో కౌంటర్ దాఖలు చేసారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి ఘటనలో నందిగం సురేష్ స్వయంగా పాల్గొన్నాడని...

  • Written By:
  • Publish Date - September 28, 2024 / 10:54 AM IST

ఎంపీ నందిగం సురేష్ బెయిల్ కొటేషన్ కొట్టివేయండి అంటూ మంగళగిరి పోలీసులు హైకోర్ట్ లో కౌంటర్ దాఖలు చేసారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి ఘటనలో నందిగం సురేష్ స్వయంగా పాల్గొన్నాడని… సీసీ ఫుటేజ్ లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు… ఆయన బెయిల్ పిటీషన్ కొట్టేయాలని కౌంటర్ లో కోరారు. 42 మంది సాక్షులను విచారించగా.. సురేష్ అక్కడే ఉన్నట్లు వారు చెప్పారని పోలీసులు పేర్కొన్నారు.

ఏమాత్రం విచారణకు సహకరించడం లేదన్నారు. మొత్తం 110 మందిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసామని… 88 మంది నిందితుల గుర్తించామని తెలిపారు. నిందితులపై హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసినట్టు హైకోర్ట్ కి వివరించారు. విచారణ సమయంలో పంచనామాపై సురేష్ సంతకం పెట్టలేదన్నారు. రెండు ఐఫోన్లు పోయినట్లు చెప్తున్న సురేష్… పోయినప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు. అనారోగ్యం కారణంగా చెబుతున్న సురేష్ మెడికల్ రిపోర్టులు ఎందుకు కోర్టుకు సబ్మిట్ చేయట్లేదు అని కౌంటర్ లో పోలీసులు ప్రశ్నించారు. రెండు సెల్ ఫోన్లు దొరికితే విచారణ పూర్తవుతుందని పోలీసులు కౌంటర్ లో స్పష్టం చేసారు.