BANDI SANJAY: బండి సంజయ్‌కు ఊహించని షాక్‌.. కరీంనగర్‌లో సొంత పార్టీ నేతల తిరుగుబాటు

కరీంనగర్‌ కమలం పార్టీలో కలకలం రేగింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన సీనియర్లు బండిపై తిరుగుబాటుకు దిగారు. కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సంజయ్‌కి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. మీటింగ్‌లో దాదాపు వంద మంది నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Written By:
  • Publish Date - December 15, 2023 / 01:57 PM IST

BANDI SANJAY: బండి సంజయ్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. తెలంగాణ బీజేపీలో గ్రూప్‌ వార్ మొదలైందని.. ఈటల, రఘునందన్‌ రావులాంటి సీనియర్లు ఆయనకు వ్యతిరేకంగా ఏకం అయ్యారని ప్రచారం జరుగుతున్న వేళ.. ఇప్పుడు మరో ఝలక్ తగిలింది. కరీంనగర్‌ కమలం పార్టీలో కలకలం రేగింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన సీనియర్లు బండిపై తిరుగుబాటుకు దిగారు. కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సంజయ్‌కి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు.

Rajasthan CM, Bhajanlal Sharma : రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ.. అర్ధరాత్రి ప్రమాణ స్వీకారం..

మీటింగ్‌లో దాదాపు వంద మంది నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో బండికి ఎంపీ సీటు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. తమలో ఒకరికి ఎంపీ సీటు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ విఫలం అయ్యారని విమర్శించారు తిరుగుబాటు నేతలు. బండి సంజయ్‌ ఒక్కడికే అన్ని అవకాశాలు ఇస్తున్నారని.. అయినా పార్టీకి ప్రత్యక్ష ఎన్నికల్లో ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోందని ఫైర్ అయ్యారు. గతంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలిచేవారని.. బండి వచ్చాక అది కూడా లేదని ఘాటు ఆరోపణలు గుప్పించారు. విద్యాసాగర్‌రావు ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిచిన విషయాన్ని వాళ్లు గుర్తుచేశారు. పార్టీని నమ్ముకుని కష్టపడుతున్న వారిని బండి పక్కన పెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి ఒంటెద్దు పోకడలతో విసిగిపోయామని అంటున్నారు.

బండి తీరుపై కేంద్ర నాయకత్వంతో పాటు ఆర్ఎస్ఎస్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందించారు. త్వరలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. బీజేపీ సీనియర్లు రెండేళ్ల కిందట కూడా ఇలాగే సమావేశమై బండిపై అసంతృప్తి వెళ్లగక్కారు. ఆ సమయంలో బండి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించాలని అధిష్టానాన్ని కోరారు. ఐతే అధిష్టానం సీనియర్లపైనే రివర్స్ అయింది. ఇప్పుడు మళ్లీ సీనియర్లు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. దీంతో బండి ఎలా రియాక్ట్ అవుతారు.. బండి విషయంలో పార్టీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.