కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. సిఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఇద్దరూ పాదయాత్ర చేస్తామని ప్రకటించిన నేపధ్యంలో… బండి సంజయ్ స్పందించారు. మీ ఇద్దరూ చేయాల్సింది పాదయాత్ర కాదు… మోకాళ్ల యాత్ర చేయండి అంటూ ఎద్దేవా చేసారు. 6 గ్యారంటీలపై రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసే దమ్ముందా? అని నిలదీశారు. గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన తప్పులను ఒప్పుకునే దమ్ముందా? అని ప్రశ్నించారు. మోదీపై కాంగ్రెస్ యుద్దం దేనికోసం అని ఆయన ప్రశ్నించారు.
పేదల అభ్యున్నతికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నందుకా? అని మండిపడ్డారు. కాంగ్రెస్ వన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలేనన్న బండి సంజయ్… దీపావళి దాటినా రాజకీయ బాంబులు పేల్చలేదేం? అని నిలదీశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే అన్నారు బండి. హిందువులపై ట్రంప్ కు ఉన్న శ్రద్ధ కాంగ్రెస్ కు లేదా? అని ప్రశ్నించారు. హిందువులపై దాడులు జరుగుతుంటే నోరెందుకు మెదపరు? అని నిలదీశారు. హిందువుల ఓట్లు మీకు అక్కర్లేదని చెప్పే దమ్ముందా? అంటూ కాంగ్రెస్ ను ప్రశ్నించారు.