సుద్దపూస…. ఇప్పుడేమంటాడో… బామ్మర్థి ఫాంహౌజ్ లోనే రేవ్ పార్టీలా? అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేసారు. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో అని ‘‘సుద్దపూస‘‘ను కావాలనే తప్పించారనే వార్తలొస్తున్నయ్ అన్నారు. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్ పై రాజీధోరణి ఎందుకు? అని నిలదీశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పొలిటిక్స్ సిగ్గు చేటు అని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలి అని డిమాండ్ చేసారు.
సీసీ పుటేజీసహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని కోరారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాల్సిందే అన్నారు సంజయ్. బడా నేతలతోసహా రేవ్ పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాలని కోరిన ఆయన… చట్టం ముందు అందరూ సమానమని నిరూపించేలా చర్యలుండాలన్నారు. ట్విట్టర్ టిల్లు బామ్మర్థి ఫాంహౌజ్ ‘రేవ్ పార్టీ’ కేసు నీరుగార్చే కుట్ర మొదలైందని… రేవ్ పార్టీలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని పోలీసులతో చెప్పించేలా కాంగ్రెస్ నుండి ఒత్తిడి మొదలైంది అంటూ ఫైర్ అయ్యారు. లిక్కర్ పార్టీయే తప్ప రేవ్ పార్టీ కాదని బుకాయించేందుకు సిద్ధమయ్యారన్నారు.
రేవ్ పార్టీ పంచనామాలోనే డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. విదేశీ మద్యం బాటిళ్ల పేర్లను మాత్రమే ప్రస్తావించినట్లు తెలిసిందన్నారు. ట్విట్టర్ టిల్లు, ఆయన కుటుంబ సభ్యులను తప్పించి ఈ కేసులో అనామకుల పేర్లను చేర్చే కుట్ర మొదలైందని తద్వారా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ఇచ్చే దివాళీ గిఫ్ట్ ఇదేనన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే….అని మరోసారి నిరూపితమైందని ఫైర్ అయ్యారు. ట్విట్టర్ టిల్లు కుటుంబ సభ్యులున్నట్లు ఫోటోలతోసహా టీవీల్లో వస్తున్నా ఆ దిశగా విచారణ ఎందుకు జరపడం లేదు? అని ప్రశ్నించారు