BANDI SANJAY: బండి సంజయ్‌ బీజేపీలో ఒంటరి అయ్యారా..?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు జరగబోతోందని.. మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు ఇవ్వడం ఖాయం అని కొందరు అంటుంటే.. బండికి అధ్యక్ష పదవి ఖాయం కానీ ఎంపీ టికెట్టే అనుమానం అంటూ మరికొందరు చర్చ మొదలుపెట్టారు.

  • Written By:
  • Publish Date - December 13, 2023 / 06:52 PM IST

BANDI SANJAY: ఒక విజయం అన్ని తప్పులను మర్చిపోయేలా చేస్తోంది. ఐతే ఒక ఓటమి మాత్రం.. మర్చిపోయిన తప్పులను కూడా గుర్తు చేస్తుంది. ఇప్పుడు బీజేపీలో అలాంటి పరిస్థితే కనిపిస్తుందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు జరగబోతోందని.. మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు ఇవ్వడం ఖాయం అని కొందరు అంటుంటే.. బండికి అధ్యక్ష పదవి ఖాయం కానీ ఎంపీ టికెట్టే అనుమానం అంటూ మరికొందరు చర్చ మొదలుపెట్టారు.

Gaddam Prasad Kumar: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్..!

ఐతే ఇదంతా ఎలా ఉన్నా.. పార్టీలో బండి సంజయ్ ఒంటరి అయ్యారా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయ్. పార్టీలో బండి వర్సెస్‌ మిగతా సీనియర్లుగా పరిస్థితి మారినట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవి నుంచి తొలగించిన నాటి నుంచి.. బండి సంజయ్‌ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించట్లేదు. కొన్ని నియోజకవర్గాల్లో మినహా ఆయన పెద్దగా ప్రచారంలోనూ పాల్గొనలేదు. ఇక అటు కమలం పార్టీని గ్రూప్‌వార్ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఎన్నికల ముందు సీనియర్లు అంతా కలిసి స్పెషల్‌గా భేటీ అయ్యారు. ఆ బ్యాచ్‌లో చాలామంది పార్టీ మారిపోయారు. వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి, విజయశాంతిలాంటి సీనియర్‌ నేతలు ఇప్పటికే కాంగ్రెస్‌ గూటికి చేరిపోయారు. ఐతే రఘునందన్‌ రావు, ఈటల రాజేందర్ ఓ వర్గంగా మారినట్లు తెలుస్తోంది. ఈ మధ్య రఘునందన్‌ రావు.. ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా బండి సంజయ్‌పై సెటైర్లు వేశారు.

ఒక్కరి వల్ల పార్టీ ఎప్పటికీ గెలవదని.. నేనుంటే అలా ఉండేది.. ఇలా ఉండేదని మాట్లాడడం సరికాదు అంటూ కామెంట్‌ చేశారు. అలా చెప్తున్న వ్యక్తి స్వతహాగా ఎందుకు ఓడిపోయారో చెప్పాలని ప్రశ్నించారు. దీంతో మరోసారి బీజేపీలో విబేధాలు బయటపడినట్లు అయింది. గతంలోనూ రఘునందన్‌ బండి సంజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అటు బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్.. జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు అడపదడపా కలిసి మీడియా ముందుకు వస్తున్నప్పటికీ.. బండి సంజయ్ నియోజకవర్గం దాటి రావడం లేదు. దీంతో ఆయనకు, రాష్ట్రస్థాయి లీడర్లకు మధ్య బంధం బ్రేక్ అయిందా అనే వార్తలు ఊపందుకున్నాయ్. మరి దీనిపై బండి రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.