PAWAN KALYAN: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క ఒక సంచలనం. కొల్లాపూర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి.. ఏడు వేల వరకు ఓట్లు తెచ్చుకుంది. ఇదే క్రమంలో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనకు కొన్ని చోట్ల బర్రెలక్కకంటే తక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో కొందరు నెటిజన్లు పవన్ జనసేనకంటే బర్రెలక్క బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ అంశంపై బర్రెలక్క స్పందించారు. పవన్‌తో తనను పోల్చడం సంతోషంగా ఉందన్నారు. “పవన్ కల్యాణ్ లాంటి నాయకుడితో నన్ను పోల్చడం సంతోషంగా ఉంది.
BRS MP SEATS: కారు తిరుగుతుందా..? కారుకు పొంచి ఉన్న మరో గండం..
పవన్ కూడా న్యాయం కోసమే పోరాడుతున్నారు. డబ్బు సంపాదించాలనే ఆశ ఆయనకు లేదు. పవన్ ప్రజా సేవ కోసమే రాజకీయాల్లో ఉన్నారు. ఓటమితోనే గెలుపు సాధ్యమవుతుంది” అని బర్రెలక్క వ్యాఖ్యానించింది. దీంతో ప్రస్తుతం బర్రెలక్క కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, బర్రెలక్క గెలవకపోయినప్పటికీ ఆమె పోరాట స్ఫూర్తిని అందరూ ప్రశంసిస్తున్నారు. ఎలాంటి రాజకీయ అనుభవం, ఆర్థిక అండదండలూ లేకపోయినా స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగింది. ఎందరో సామాన్యులకు స్ఫూర్తిగా నిలిచింది.