BARRELAKKA: బర్రెలక్కకు ఎన్ని ఓట్లు రాబోతున్నాయి? ఇది ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నా.. ఓట్‌బ్యాంక్‌ మాత్రం భారీమొత్తంలో చీలిపోబోతోంది. అయితే ఇది ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే విషయం ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌‌గా మారింది. శిరీషకు ఓటు వేస్తున్నారంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ వ్యతిరేక ఓటే అయ్యుంటుంది.

  • Written By:
  • Publish Date - December 2, 2023 / 06:53 PM IST

BARRELAKKA: తెలంగాణలో రాజకీయ పార్టీల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలబోతోంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండు పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తునే సెలబ్రేషన్స్‌కు సన్నద్ధమౌతున్నాయి. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో కొల్లాపూర్‌ ఇప్పుడు ప్రతీ ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్‌ నుంచి బీరం హర్షవర్ధన్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పోటీ చేస్తున్నారు. కానీ ఇక్కడ హాట్‌ టాపిక్‌ వీళ్లు కాదు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న బర్రెలక్క అలియాస్‌ శిరీషే కీలకం.

ELECTION RESULTS: కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. 8 గంటలకు ప్రారంభం..

ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ ద్వారా ఫేమస్‌ ఐన శిరీష.. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక బర్రెలక్కను సైడ్‌ చేసేందుకు కొందరు నేతలు ఆఫర్లు ఇవ్వడం.. ఆమె తమ్ముడిపై కొందరు వ్యక్తులు దాడి చేయడంతో.. దేశవ్యాప్తంగా శిరీష హాట్‌ టాపిక్‌గా మారింది. ఆమెకు ఊహించని రేంజ్‌లో మద్దతు లభించింది. బర్రెలక్క తరఫున వాదించేందుకు అమెరికా నుంచి కూడా కొందరు లాయర్లు వచ్చారు. ముందు వరకూ బర్రెలక్క పొజిషన్‌ ఒకలా ఉంటే.. ఈ దాడి తరువాత సీన్‌ మారిపోయింది. ఈ ఘటన తరువాత బర్రెలక్క ఓట్‌బ్యాంక్‌ కూడా బాగా పెరిగినట్టు తెలుస్తోంది. గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నా.. ఓట్‌బ్యాంక్‌ మాత్రం భారీమొత్తంలో చీలిపోబోతోంది. అయితే ఇది ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే విషయం ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌‌గా మారింది. శిరీషకు ఓటు వేస్తున్నారంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ వ్యతిరేక ఓటే అయ్యుంటుంది. నిజానికి శిరీష లేకపోతే ఆ ఓట్‌ కాంగ్రెస్‌ లేదా బీజేపీకి వెళ్లి ఉండాలి.

కానీ శిరీష బరిలో ఉన్న కారణంగా.. సెటిమెంట్‌తో చాలా మంది ఆమెకు ఓట్‌ వేసే చాన్స్‌ ఉంది. దీంతో ప్రభుత్వం వ్యతిరేక ఓటు బ్యాంక్‌ భారీ లెవెల్‌లో చీలిపోతుంది. ఇది అటు తిరిగి ఇటు తిరిగి ప్రతిపక్షాలకే మైనస్‌ అయ్యే పాయింట్‌. బీఆర్‌ఎస్‌కు వాళ్లకు ఉండే తటస్థ ఓటర్లు ఉంటారు. వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను తమ వైపు తిప్పుకోవడంలోనే ప్రతిపక్షాల చతురత దాగి ఉంటుంది. కానీ శిరీష కారణంగా వాళ్లకు వెళ్లాల్సిన ఓట్‌బ్యాంక్‌ చీలిపోనుంది. అది ఇండైరెక్ట్‌గా బీఆర్ఎస్‌కు ప్లస్‌ అయ్యే అంశం. కొన్ని అంచనాల ప్రకారం శిరీషకు 10 నుంచి 15 వేల ఓట్లు వచ్చే చాన్స్‌ ఉంది. ఇది బీజేపీ, కాంగ్రెస్‌లకు పెద్ద దెబ్బే. చూడాలి మరి శిరీష కొల్లాపూర్‌లో ఏ రేంజ్‌లో ఓట్‌ బ్యాంక్‌ చీల్చిందో.