PV Narasimha Rao: పీవీకి భారతరత్న వెనక వ్యూహం ఉందా.. కాంగ్రెస్‌ను మోదీ కోలుకోలేని దెబ్బతీశారా..?

కీలకమైన ఎన్నికల వేళ.. కాంగ్రెస్‌ పార్టీని బీజేపీ పక్కాగా ఇరుకునపెడుతోంది. అప్పుడు పటేల్.. ఇప్పుడు పీవీ విషయంలో అదే నిజం అనిపిస్తోంది. 400 ప్లస్ సీట్లు టార్గెట్‌గా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. దీనికోసం ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తోంది.

  • Written By:
  • Publish Date - February 9, 2024 / 08:02 PM IST

PV Narasimha Rao: ఎప్పుడో జరగబోయే పరిణామానికి.. ఇప్పుడే పావులు కదపడం రాజకీయంలో మాత్రమే చూస్తుంటాం. కొందరి ఎత్తులు ఊహించేలా ఉంటే.. మరికొందరి స్ట్రాటజీలు ఊహాతీతం అనిపిస్తుంటాయ్. పాలిటిక్స్ ఎప్పుడూ హాట్‌టాపిక్ అయ్యేది అందుకే! ప్రత్యర్థిని దెబ్బతీయడంలో కమలం పార్టీ ఓ ఆకు ఎక్కువే చదివిందా అనిపిస్తోంది ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ! ఇప్పుడు హస్తం పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఒకటి గెలిస్తే.. రెండు చోట్ల ఓటమి అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. పోనీ లోకల్‌ పార్టీలను ఏకం చేసి.. బీజేపీకి పోటీ ఇద్దాం అనుకుంటే.. ఆ ప్రయత్నాలు కూడా సక్సెస్ కావడం లేదు.

PAWAN KALYAN: పార్లమెంట్‌ సీటుపై కన్నేసిన పవన్‌.. ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..?

ఇండియా పేరుతో ఓ కూటమి ఏర్పాటు చేసి.. కమలానికి షాక్ ఇవ్వాలని ప్రయత్నించగా.. ఆరంభంలోనే లుకలుకలు బయటపడ్డాయ్. ఇక అటు తమ వారు, తమ నాయకులు అని కాంగ్రెస్ చెప్పుకునే పేర్లను.. ఇప్పుడు బీజేపీ ఓన్ చేసుకోవడం మొదలుపెట్టింది. కీలకమైన ఎన్నికల వేళ.. కాంగ్రెస్‌ పార్టీని బీజేపీ పక్కాగా ఇరుకునపెడుతోంది. అప్పుడు పటేల్.. ఇప్పుడు పీవీ విషయంలో అదే నిజం అనిపిస్తోంది. 400 ప్లస్ సీట్లు టార్గెట్‌గా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. దీనికోసం ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తోంది. ఇలాంటి సమయంలో మాజీ ప్రధాని, కాంగ్రెస్ కీలక నేత పీవీకి.. భారతరత్న ప్రకటించి.. హస్తం పార్టీని మరింత దెబ్బతీసింది. కాంగ్రెస్‌ వదిలేసిన నేతలను, గుర్తించని నేతలను.. తాము గుర్తిస్తున్నామని, గౌరవిస్తున్నామనే సంకేతాలను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. గతంలో పటేల్ విషయంలో జరిగిందే.. ఇప్పుడు పీవీ భారతరత్నతో జరగడం ఖాయం అనే ప్రచారం జరుగుతోంది. గుజరాత్‌లో సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ భారీ విగ్రహం ఏర్పాటు చేశారు. నిజానికి పటేల్ పనిచేసింది.. పదవులు పొందింది పూర్తిగా కాంగ్రెస్‌లోనే ! అలాంటి వ్యక్తికి ప్రపంచం మాట్లాడుకునే విగ్రహం ఏర్పాటు చేసి.. అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది బీజేపీ.

దీంతో గుజరాత్‌లో అంతో ఇంతో ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ తుడిచిపెట్టుకుపోయినట్లు అయింది. ఇప్పుడు పీవీ విషయంలోనూ.. కాంగ్రెస్‌ను కార్నర్‌ చేసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. భారత్‌ ఆర్థికంగా దారి చూపించిన పీవీని.. కాంగ్రెస్‌ను అవమానించిందని.. కమలం పార్టీ నేతలు పదేపదే ఆరోపిస్తుంటారు. పీవీ చనిపోయినప్పుడు.. ఆయ‌న పార్థివదేహాన్ని న్యూఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్‌కు తెస్తామ‌ని అన్నా.. పార్టీ వ‌ద్దని చెప్పిందనే ప్రచారం సాగుతోంది. నిజానికి ఆ తర్వాత ఎప్పుడూ.. కాంగ్రెస్ నోట పీవీ మాట కూడా వినిపించలేదు. ఐతే ఇప్పుడు పీవీకి భారతరత్న ప్రకటించి.. పటేల్‌తో పాటు ఆయనను కూడా బీజేపీ ఓన్ చేసుకుంది. ఐతే పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వడం ద్వారా.. తెలంగాణలో కమలం పార్టీ పుంజుకుంటుందా లేదా అన్నది పక్కనపెడితే.. దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్‌ను ఎండ‌గ‌ట్టే అవకాశం అయితే ఉంది. జోడో యాత్ర, దీక్షలు అంటూ.. కాంగ్రెస్‌ అంతో ఇంతో సంపాదించుకున్న సింపథీని దెబ్బతీసే అవకాశాలు ఉంటాయ్.