హైదరాబాద్ లో హైడ్రా దెబ్బకు భవనాల యజమానులు భయపడిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎవరి భవనం హైడ్రా అధికారులు కూలుస్తారో అనే ఆందోళన నెలకొంది. దీనికి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో అధికారులు కూడా స్పీడ్ పెంచుతున్నారు. ఇక ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన భవనాల మీద అధికారులు దృష్టి పెడుతున్నారు.
తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు చెందిన లోటస్ పాండ్ మీద దృష్టి పెట్టారు హైడ్రా అధికారులు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపి అధినేత… జగన్ మోహన్ రెడ్డి కి హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేసారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్, లోటస్ పాండ్ చెరువు శిఖంలో ఇంటిని నిర్మించినట్టు అధికారులు ప్రకటించారు. దీనిపై సమాధానం ఇవ్వాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.