ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో మద్యం షాపులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది. త్వరలో అమలులోకి నూతన మద్యం పాలసీ రానుంది. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రభుత్వ మద్యం షాపులను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే రాష్ట్రంలో ప్రైవేట్ మద్యం షాపులు రాష్ట్రంలో ఏర్పాటు కానున్నాయి.
అదే విధంగా నేషనల్ బ్రాండ్ లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గత ప్రభుత్వం మద్యం విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కల్తీ మద్యం, పిచ్చి బ్రాండ్ లు రాష్ట్రానికి తెచ్చారని ఆరోపణలు వచ్చాయి. సామాన్య ప్రజల్లో కూడా మద్యంపై ఆగ్రహం వ్యక్తమైంది. ఇప్పుడు ప్రభుత్వం నూతన మద్యం పాలసీతో తక్కువ ధరకే మద్యాన్ని అందించనుంది.