ఒక్క కుటుంబం.. రెండు కేసులు.. ముగ్గురు వ్యక్తులు.. ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా కనిపిస్తోంది. మంచు ఫ్యామిలీ కథాచిత్రమ్‌లో మలుపులతో.. ఫిల్మ్‌నగర్‌లో పెద్ద పంచాయితే మొదలైంది. తనపై కొందరు వ్యక్తులు దాడి చేశారని.. తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. అది జరిగిన కాసేపటికే.. మంచు మనోజ్‌తో తనకు ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు… లేఖ రాసి రాచకొండ కమిషనర్‌కు కంప్లైంట్ ఇవ్వగా.. మనోజ్, మౌనిక మీద కేసులు నమోదయ్యాయ్. దీంతో మంచు ఫ్యామిలీ వివాదం మరింత ముదిరింది. మోహన్ బాబు ఫ్యామిలీ అంటే.. డిసిప్లిన్‌కు పెట్టింది పేరు. అలాంటి కుటుంబం ఇప్పుడు బజారున పడింది. తండ్రి మీద కొడుకు… కొడుకు మీద తండ్రి పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. ఎందుకొచ్చిన తలపోటు అని.. ఒకప్పుడు ఆ ఫ్యామిలీ వైపు చూసేవారు కాదు ఎవరూ ! అలాంటిది మంచు వారి కుటుంబ కలహ చిత్రమ్ ప్రతీ ఒక్కరిని కళ్లు పెద్దవి చేసుకొని చూసేలా చేస్తోంది.
నిజానికి మంచు కుటుంబంలో వివాదాలు కొత్తేం కాదు. ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకున్నారు గతంలో ! వీడియోలు బయటకు వచ్చాయ్ కూడా ! ఐతే అదంతా నాలుగోడల మధ్యే అలా జరిగిపోయేది. అలాంటిది ఇప్పుడు ఆ ఫ్యామిలీ బజారుకెక్కింది. ముసుగులో గుద్దులాటలు లేవ్ అన్నట్లుగా మంచులో గుద్దులాటలు మొదలయ్యాయ్. తనపై దాడి చేశారంటూ భార్యను తీసుకొని ఆస్పత్రికి కుంటుతూ వెళ్లి మరీ.. మీడియాకు మంచి కవరేజ్ ఇచ్చాడు మనోజ్. ఐతే పీఎస్‌కు వెళ్లి మెడికల్ సర్టిఫికెట్లు చూపించి మరీ కంప్లైట్ చేశారు. తన ఇంటి సీసీటీవీ ఫుటేజీని విష్ణు అనుచరులు ఎత్తుకెళ్లిపోయారని.. ఆ ఫిర్యాదులో రాసుకొచ్చారు. అది జరిగిన కాసేపటికే.. మోహన్‌బాబు కంప్లైంట్‌తో ఈ ఫైర్ కాస్త వైల్డ్‌ఫైర్‌గా మారింది. ఈ ఫిర్యాదులతో ఆస్తుల కోసమే తండ్రీకొడుకుల పంచాయితీ అనుకుంటున్న వేళ.. మనోజ్ యూటర్న్ తీసుకున్నారు. ఆస్తుల కోసమో, డబ్బుల కోసమో తన పోరాటం కాదని.. అత్మగౌరవం కోసం అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. కనిపించే వివాదం.. వినిపించే మాటలేవీ నిజం కాదా.. అసలు కారణం వేరే ఉందా.. మనోభావాలు దెబ్బతీసే స్థాయిలో తండ్రీకొడుకుల మధ్య పంచాయితీ జరిగిందా అనే అనుమానాలు తెరమీదకు వస్తున్నాయ్. ఇన్ని వివాదాల మధ్య కూడా సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉన్న మోహన్ బాబు.. చేసిన కొన్ని పోస్టులు మరింత ఆసక్తి రేపాయ్. ఆస్తి తగాదాల మధ్య ప్రాణాలు కోల్పోయినట్టుగా… శ్రీరాములయ్య మూవీ సీన్‌ను పోస్ట్ చేశారు. ఆ తర్వాత కోరికలే గుర్రాలైతే సినిమా సీన్ పోస్ట్ చేశారు.
ఇవన్నీ మోహన్‌బాబు ఎందుకు పోస్ట్ చేశారు.. ఎందుకు చేశారు.. ఆస్తుల గొడవలు తన ప్రాణాల మీదకు వస్తున్నాయని చెప్పాలని అనుకున్నారా.. ఇన్ని చేశారు సరే, ఆ తర్వాత ఎందుకు యూటర్న్ తీసుకున్నారు… ఇది చిన్న గొడవ అని.. తమకు తామే సర్దుకుంటామని ఎందుకు చెప్పారు.. విష్ణు వల్లే మాట మార్చాల్సి వచ్చిందా.. ఇలా ఈ వివాదంలో సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ! కొడుకుల మధ్య ఏం జరిగినా.. ఎన్ని గొడవలు అయినా.. మోహన్ బాబు ఏ రోజూ ఇంటిగుట్టు బయటపెట్టలేదు. ఆ మధ్య తన ఇంటికి వచ్చి… విష్ణు దాడి చేశాడంటూ మనోజ్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. అది వైరల్ కావడంతో.. అదంతా ఉత్తుత్తిదే.. ప్రాంక్.. రియాల్టీ షో అని ఏదో సోది చెప్పి బయటికి రాకుండా కవర్ చేశారు. కట్ చేస్తే.. ఎన్నాళ్ల నుంచి రగులుతుందో కానీ.. మంచు ఫ్యామిలీ విభేదాలు మళ్లీ బయటపడ్డాయ్. ఐతే ఇక్కడ హైలైట్ ఏంటంటే.. తండ్రీ కొడుకుల ఫైటింగ్ సీక్వెన్స్‌లో ఈసారి ఎక్కడా విష్ణు పేరు బయటకు రాలేదు.
దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన విష్ణు… ఇది చిన్న గొడవని, తామే సాల్వ్ చేసుకుంటామని.. జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటికి వెళ్లారు. విష్ణు నియమించిన 40మంది బౌన్సర్లు.. మనోజ్ పెట్టిన 30మంది బౌన్సర్లను బయటకు పంపించారు. ఇద్దరు కొడుకులతో మోహన్‌బాబు చర్చలు జరిపినట్లు టాక్. ఐతే ఇంట్లో పనిచేసే ఓ వర్కర్ విషయంలో గొడవ మొదలైందని.. అది కాస్త తండ్రీకొడుల మధ్య మంటలు రేపిందనే ప్రచారం జరుగుతోంది. తనకు సేవలు చేసే సర్వెంట్‌ను కొట్టాడని.. మనోజ్‌ను మోహన్‌బాబు నిలదీశాడని.. మధ్యలో తన భార్య మీద కూడా అరిచేశాడని.. అక్కడితో మొదలైన గొడవ.. ఇప్పుడు పీఎస్ వరకు వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో కొత్త ప్రశ్నలు తెరమీదకు వచ్చాయ్. ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా లేదంటే.. మరో సంచలనంగా మారుతుందా.. అసలు టోటల్ కాంట్రవర్సీపై మంచు లక్ష్మీ ఎందుకు రియాక్ట్ కావడం లేదు.. ఇది ఆ కుటుంబం మ్యాటర్ అని వదిలేసిందా.. వీటన్నింటికి ఆన్సర్ కావాలంటే.. మంచు కుటుంబం నుంచి ఎవరో ఒకరు స్పందించాల్సిందే. ఏమైనా ఈ వివాదం ఇక్కడితో ఆపేస్తే.. తండ్రీకొడుకులకే కాదు.. ఆ కుటుంబానికి మంచిది. లేదంటే మరింత పలుచన అవడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.