BIHAR DNA ISSUE: సీఎం రేవంత్‌పై డీఎన్ఏ లొల్లి.. బిహార్‌లో దిష్టిబొమ్మ దగ్ధం..!

బిహార్ డీఎన్ఏ కంటే.. తెలంగాణ డీఎన్ఏనే బెటర్ అని ప్రజలు తనను ఎన్నుకున్నారని రేవంత్ కామెంట్ చేశారు. తెలంగాణ డీఎన్ఏ.. బిహార్ డీఎన్ఏ అంటూ ఏమీ ఉండదనీ.. అందరిదీ హిందూస్థాన్ డీఎన్ఏయేనే అని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు.

  • Written By:
  • Publish Date - December 9, 2023 / 02:49 PM IST

BIHAR DNA ISSUE: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బిహార్ నాయకులు మండిపడుతున్నారు. బిహార్ డీఎన్ఏను కాదని.. తెలంగాణ డీఎన్ఏను ప్రజలు ఎన్నుకున్నారని రేవంత్ కామెంట్ చేయడం వివాదస్పదమైంది. బిహార్ ప్రజలను కించపరిచేలా రేవంత్ వ్యాఖ్యానించారని సీఎం నితీష్ కుమార్‌తో పాటు ఆ రాష్ట్ర నాయకులు ఫైర్ అవుతున్నారు. నా డీఎన్ఏ తెలంగాణ.. కానీ కేసీఆర్ డీఎన్ఏ బిహార్‌ది. ఎందుకంటే ఆయన పూర్వీకులు బిహార్‌కు చెందినవారు. అక్కడి నుంచి విజయనగరం వలస వచ్చి.. ఆ తర్వాత తెలంగాణకు వచ్చి స్థిరపడ్డారు.

CM REVANTH REDDY: మహాలక్ష్మి పథకం ప్రారంభం.. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న సీఎం రేవంత్

బిహార్ డీఎన్ఏ కంటే.. తెలంగాణ డీఎన్ఏనే బెటర్ అని ప్రజలు తనను ఎన్నుకున్నారని రేవంత్ కామెంట్ చేశారు. తెలంగాణ డీఎన్ఏ.. బిహార్ డీఎన్ఏ అంటూ ఏమీ ఉండదనీ.. అందరిదీ హిందూస్థాన్ డీఎన్ఏయేనే అని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. తెలంగాణ సీఎం ఇలాంటి కామెంట్స్ చేయడం బాధాకరమన్నారు. డీఎన్ఏకు బదులు.. తెలంగాణ ప్రజలకు మంచి చేయడంపై రేవంత్ దృష్టి పెట్టాలన్నారు బిహార్ మంత్రి అశోక్ చౌబే. 2015 ఎన్నికల్లో ప్రధాని మోడీ కూడా ఇలాగే మాట్లాడి.. ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి డీఎన్ఏ వ్యాఖ్యలపై బీజేపీ కూడా మండిపడింది. జనాన్ని విభజించేలా మాట్లాడుతున్న రేవంత్‌తో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు కేంద్ర మాజీ మంత్రి రవి శంకర్ ప్రసాద్.

దేశాన్ని ముక్కలు చేయాలని ఆయన అనుకుంటున్నారా.. దీనిపై బిహార్ కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని రవి శంకర్ ప్రసాద్ నిలదీశారు. ఇండియా కూటమి మొదటి నుంచీ హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్నీ అవమానిస్తోందన్నారు మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ. కాంగ్రెస్ విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్. బిహార్‌లో బీజేపీ నేతలు.. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.