బిష్ణోయ్ దెబ్బ, బుల్లెట్ ప్రూఫ్ కారు కొంటున్న సల్మాన్, కాస్ట్ ఎంతంటే

సినిమాల్లో వందల మంది గ్యాంగ్ లను ఒంటి చేత్తో, చుక్క చెమట పట్టకుండా మట్టి కరిపించే హీరో ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ పేరు వింటే చెమటలు కక్కుతున్నాడు. ఏ వైపు నుంచి లారెన్స్ గ్యాంగ్ అటాక్ చేస్తుందో అని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాడు.

  • Written By:
  • Publish Date - October 19, 2024 / 07:23 PM IST

సినిమాల్లో వందల మంది గ్యాంగ్ లను ఒంటి చేత్తో, చుక్క చెమట పట్టకుండా మట్టి కరిపించే హీరో ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ పేరు వింటే చెమటలు కక్కుతున్నాడు. ఏ వైపు నుంచి లారెన్స్ గ్యాంగ్ అటాక్ చేస్తుందో అని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాడు. ఫాం హౌస్ లు, ఖరీదైన పార్టీలు, అమ్మాయిలు ఇలా అన్ని విధాలుగా ఎంజాయ్ చేసిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే భయపడిపోతున్నాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ ను రక్షించుకోవడం మహారాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ గా మారింది.

లారెన్స్ బిష్ణోయ్ ఏ వైపు నుంచి గన్ ఎయిమ్ చేసాడో అర్ధం కాక భద్రతా సిబ్బంది అను నిత్యం సల్మాన్ ఖాన్ ను పసి బిడ్డ మాదిరి కాపాడుతున్నారు. ఇక బిగ్ బాస్ షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకుంటాడు అనే వార్తలు వచ్చాయి, ఆ తర్వాత భారీ సెక్యూరిటీతో మళ్ళీ షూటింగ్ కు వెళ్తున్నాడు అనే విషయం బయటకు వచ్చింది. ఏకంగా 60 మంది సిబ్బందిని బిగ్ బాస్ హౌస్ లో నియమించుకుని… హౌస్ లో ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళకుండా లోపలి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏకంగా ఎమ్మెల్యేనే వై కేటగిరి భద్రతలో చంపినప్పుడు సల్మాన్ ఓ లెక్క కాదంటున్నారు కొందరు.

ఇక వ్యక్తిగతంగా కూడా సల్మాన్ ఖాన్ ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మాజీ పోలీస్ అధికారులలో సల్మాన్ కు స్నేహితులు ఉన్నారు. ఇప్పుడు వారి నుంచి సలహాలు తీసుకుంటున్నాడు. భద్రత విషయంలో ప్రభుత్వం మీదనే ఆధారపడకుండా సెక్యూరిటీ ఏజెన్సీలతో కూడా సల్మాన్ చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏకంగా ఓ సెక్యూరిటీ ఏజెన్సీకి ఏడాదికి నాలుగు కోట్లు ఇవ్వడానికి కూడా సల్మాన్ రెడీ అయ్యాడని టాక్. ఇక ఇప్పుడు మరో కీలక అడుగు వేసినట్టు జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి.

భద్రత కారణంగా సల్మాన్ ఖాన్ ఇప్పుడు… దుబాయ్ నుంచి బులెట్ అండ్ బాంబ్ ప్రూఫ్ కార్ ని దిగుమతి చేసుకుంటున్నాడు అని సమాచారం. ఈ కారు ఖరీదు అక్షరాలా ఆరు కోట్లు అని టాక్. హైఎండ్ టెక్నాలజీతో ఈ కారు తయారు చేసిందట ప్రముఖ కార్ల కంపెనీ బెంజ్. వచ్చే నెల ఇది సల్మాన్ కార్ల గ్యారేజీలో చేరే అవకాశం ఉందని సమాచారం. అలాగే సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్ లను కూడా అప్పటి వరకు వాయిదా వేసేసారు అని జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు సల్మాన్ ప్రాణ భయం మాత్రం బాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్.