Raadhika Sarathkumar: రాధికకు ఆస్తులు ఎన్నో తెలుసా.. ఆమె దగ్గర అంత బంగారమా..

నామినేషన్‌ దాఖలు చేసిన రాధికా.. తన మొత్తం ఆస్తుల విలువను ప్రకటించారు. తన ఆస్తుల విలువ 53 కోట్ల 45లక్షలు అని ఎన్నికల సంఘానికి తెలిపారు. 33 లక్షల నగదు, 75తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, వస్తువులతో కలిపి 27కోట్ల 5లక్షల చరాస్తులున్నట్లు రాధిక తన నామినేషన్‌లో తెలిపారు.

  • Written By:
  • Updated On - March 26, 2024 / 08:59 PM IST

Raadhika Sarathkumar: గల్లీ టు ఢిల్లీ.. దేశంలో ఎన్నికల హడావుడే కనిపిస్తోంది. తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్‌ రిలీజ్ కావడంతో.. పలుచోట్ల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బాలీవుడ్‌తో పాటు దక్షిణాది హీరోయిన్లు కూడా పోటీ పడుతున్నారు. ఈ మధ్యే కంగనాకు బీజేపీ లోక్‌సభ సీటును కేటాయించింది. అంతకుముందు నటి రాధికా శరత్‌ కుమార్‌కు బీజేపీ అధిష్టానం ఎంపీ టికెట్‌ ఇచ్చింది. ఆమె తమిళనాడులోని విరుధునగర్‌ నుంచి పోటీలో నిలిచారు.

MLC KAVITHA JAIL: తిహార్ జైలుకు కవిత.. ఏప్రిల్ 1న బెయిల్‌పై నిర్ణయం

నామినేషన్‌ దాఖలు చేసిన రాధికా.. తన మొత్తం ఆస్తుల విలువను ప్రకటించారు. తన ఆస్తుల విలువ 53 కోట్ల 45లక్షలు అని ఎన్నికల సంఘానికి తెలిపారు. 33 లక్షల నగదు, 75తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, వస్తువులతో కలిపి 27కోట్ల 5లక్షల చరాస్తులున్నట్లు రాధిక తన నామినేషన్‌లో తెలిపారు. 26 కోట్ల 40లక్షల స్థిరాస్తులతో పాటు 14 కోట్ల 79 లక్షల అప్పులు ఉన్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆమె రాడాన్‌ మీడియా వర్క్స్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు అఫిడవిట్‌లో చేర్చారు. ఇక అటు విరుదునగర్‌లో రాధికా శరత్‌కుమార్‌కు పోటీగా.. దివంగత నటుడు కెప్టెన్‌ విజయకాంత్‌ కుమారుడు విజయ ప్రభాకరన్‌ బరిలోకి దిగారు.

అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా డీఎండీకే తరఫున ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. తనకు 17కోట్ల 95లక్షల సంపద ఉన్నట్లు ప్రకటించారు. దీంతో విరుదునగర్ పోటీ ఈసారి మరింత ఆసక్తికరంగా కనిపించబోతోంది. రాధిక భర్త, నటుడు శరత్‌ కుమార్‌.. ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి అనే పార్టీ ఏర్పాటు చేసి.. దాన్ని బీజేపీలో విలీనం చేశారు. ఆ తర్వాత రాధికకు ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ.