BJP DEMANDS TDP: చంద్రబాబు పాట్లు.. ఇస్తావా.. చస్తావా! బాబుకు బీజేపీ హుకుం

ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో సీఎం జగన్‌ను ఈసారి అధికారంలోకి రానీయకుండా చేయాలి. లేకపోతే బతకడం కష్టమని టీడీపీ అధినేత చంద్రబాబుకు భయం పట్టుకుంది. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే బెటర్ అని నిర్ణయానికి వచ్చారు.

  • Written By:
  • Publish Date - February 21, 2024 / 02:12 PM IST

BJP DEMANDS TDP: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యి లాగా తయారైంది. బీజేపీతో ముందుకు వెళ్ళకపోతే ఒక నష్టం. వెళితే మరో నష్టం. మేం అడిగినన్ని సీట్లు ఇస్తావా.. చస్తావా అని ఢిల్లీ బీజేపీ పెద్దలు హుకుం జారీ చేశారు. దాంతో బాబుకి ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు. బీజేపీ, జనసేన కోరినన్ని సీట్లు ఇస్తే.. పార్టీని నమ్ముకున్న తమ పరిస్థితి ఏంటని టీడీపీ సీనియర్లు చంద్రబాబును నిలదీస్తున్నారు. కమలంతో స్నేహం ఎందుకు పెట్టుకోవాలో బాబు వివరిస్తున్నా.. సీనియర్లు మాత్రం ససేమిరా అంటున్నారు.

TDP TENSION: సిద్ధంసభలో జనం చూసి.. టీడీపీలో దడ

ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో సీఎం జగన్‌ను ఈసారి అధికారంలోకి రానీయకుండా చేయాలి. లేకపోతే బతకడం కష్టమని టీడీపీ అధినేత చంద్రబాబుకు భయం పట్టుకుంది. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే బెటర్ అని నిర్ణయానికి వచ్చారు. కానీ అసెంబ్లీ, లోక్ సభ సీట్ల విషయంలో బిజెపి పెడుతున్న డిమాండ్లతో బెంబేలెత్తిపోతున్నారు చంద్రబాబు. ఏపీలో 8 లోక్ సభ నియోజకవర్గాలు, 25 అసెంబ్లీ నియోజకవర్గాలను ఇచ్చి తీరాల్సిందేనని బిజెపి అధిష్టానం పట్టుబడుతోంది. కానీ నాలుగు లేదా ఐదు ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ స్థానాలను ఇస్తామని నచ్చజెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ బీజేపీ పెద్దలు అందుకు ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. తాము అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. దాంతో చంద్రబాబుకు ఏం చేయాలో తెలియడం లేదు. బీజేపీ పరిస్థితి అలా ఉంటే.. ఇటు జనసేన కూడా భారీగానే సీట్లు డిమాండ్ చేస్తోంది. పవన్ కల్యాణ్‌పై కాపులు, జనసైనికుల ఒత్తిడి బాగా ఉంది. వీటికితోడు.. మధ్య మధ్యలో సీనియర్ నేత హరిరామ జోగయ్య లెటర్లు.

PAWAN KALYAN: పవన్‌ పోటీ చేసే స్థానం ఫిక్స్‌.. భీమవరం నుంచే జనసేనాని

అందుకే ఏపీలో 30 అసెంబ్లీ సీట్లు, మూడు లోక్ సభ స్థానాలను డిమాండ్ చేస్తోంది జనసేన. చంద్రబాబు మాత్రం.. 25 అసెంబ్లీ సీట్లు, రెండు లోక్ సభ సీట్లు మాత్రమే ఇస్తానంటున్నారు. అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లు ఇవ్వాల్సిందేనంటోంది జనసేన. రాజమండ్రి, తణుకు, రాజానగరం, రాజోలు అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్‌లో 40 అసెంబ్లీ సీట్లు బీజేపీ, జనసేనకి ఇచ్చేస్తే.. పార్టీని నమ్ముకున్న తమ పరిస్థితి ఏంటని చంద్రబాబును నిలదీస్తున్నారు టీడీపీ సీనియర్ నేతలు. ఇన్నాళ్ళు నియోజకవర్గాల్లో పనిచేసుకుంటుంటే.. ఇప్పుడు బీజేపీ, జనసేనకు సీట్లు పంచేయడం కరెక్ట్ కాదంటున్నారు. కానీ జగన్‌ని ఓడించడానికి త్యాగాలు తప్పవని టిడిపి నేతలకు సర్ది చెబుతున్నారు చంద్రబాబు. పోల్ మేనేజ్మెంట్‌లో జగన్‌ను కొట్టలేమని, కేంద్రం నుంచి బీజేపీ సహకారం ఉంటే తప్ప ఏపీలో పోటీ చేయడం కష్టమంటున్నారు. పోలింగ్ రోజున వైసీపీని, జగన్‌ని అడ్డుకోవడం అసాధ్యమనీ.. అందుకోసం సర్దుకుపోక తప్పదని పార్టీ నేతలకు నచ్చ చెబుతున్నారు చంద్రబాబు.

మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే చంద్రబాబుపై ఇంకెన్ని కేసులు పెడతారో తెలియదు. అందుకే స్వీయ రక్షణ, పార్టీ రక్షణ కోసం బీజేపీతో ఈసారి సర్దుకుపోవాల్సిందేనని పార్టీ సీనియర్లకు చంద్రబాబు వివరిస్తున్నారు. కానీ బీజేపీ, జనసేనకు మరీ ఇంతగా లొంగిపోవాలా అంటూ టీడీపీ సీనియర్లు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే జగన్ తమ పార్టీ అభ్యర్థుల జాబితాలు ప్రకటించుకుంటూ పోతున్నారు. ఆయా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైసీపీ ఇంఛార్జులు తమ ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. కానీ బీజేపీతో ఇంకా పొత్తు తేలకపోవడంతో.. టీడీపీ, జనసేన నుంచి ఒక్క లిస్ట్ కూడా బయటకు రాలేదు. బీజేపీ నేతలతో సంప్రదింపులు జరపడానికి ఢిల్లీకి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. ఆయన వచ్చాక ఏమైనా క్లారిటీ వస్తుందా అని రెండు పార్టీల నేతలు ఎదురు చూస్తున్నారు.