Etela Rajender: ఈటెలకు షాకిచ్చిన బీజేపీ.. వేములవాడ అభ్యర్థి మార్పు..

బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా కూడా ఉమ పనిచేశారు. తరువాత అధికార పార్టీని వదిలి ఈటెల వెంట బీజేపీలో చేరారు. అంత నమ్మకస్తురాలిగా ఉన్న కారణంగానే ఉమకు టికెట్‌ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు ఈటెల రాజేందర్‌.

  • Written By:
  • Publish Date - November 10, 2023 / 06:52 PM IST

Etela Rajender: మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ (Etela Rajender)కు బీజేపీ షాకిచ్చింది. ఇటు హుజురాబాద్‌, అటు గజ్వేల్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన బిజీగా ఉంటే.. ఆయన అనుచరులకు టికెట్‌ ఇచ్చినట్టే ఇచ్చి క్యాన్సిల్‌ చేసింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఈటెల ఫాలోవర్‌గా తుల ఉమ (TULA UMA)కు మంచి పేరుంది. ఈటెల బీఆర్ఎస్‌ నుంచి వచ్చినప్పుడు కూడా ఆయనతోపాటే పార్టీ మారిన చాలా తక్కువ మంది నేతల్లో తుల ఉమ కూడా ఒకరు.

Siddaramaiah: కేసీఆర్‌ను ఓడించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా కూడా ఉమ పనిచేశారు. తరువాత అధికార పార్టీని వదిలి ఈటెల వెంట బీజేపీలో చేరారు. అంత నమ్మకస్తురాలిగా ఉన్న కారణంగానే ఉమకు టికెట్‌ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు ఈటెల రాజేందర్‌. వేములవాడ నుంచి ఉమకు టికెట్‌ ఇవ్వాలంటూ బీజేపీ హైకమాండ్‌కు రిఫర్‌ చేశారు. హైకమాండ్‌ కూడా ఉమ పేరును పరిశీలనలోకి తీసుకుంది. రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన లిస్ట్‌లో ఉమ పేరును కూడా ప్రకటించింది. దీంతో బీఫామ్‌ తీసుకుని.. బీజేపీ నుంచి నామినేషన్‌ వేసేందుకు ఉమ రెడీ అయ్యారు. కానీ లాస్ట్‌ మినట్‌లో ఏం జరిగిందో తెలియదు కానీ.. ఉమకు టికెట్‌ రద్దు చేసింది బీజేపీ హైకమాండ్‌. ఆఖరి నిమిషంలో వికాస్‌ పేరును ఖరారు చేసింది. ఆయనకు బీఫామ్‌ కూడా ఇచ్చేసింది. దీంతో ఉమ మీడియా సాక్షిగా కన్నీరు పెట్టుకున్నారు.

బీజేపీలో మహిళలకు దక్కిన గౌరవం ఇది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్‌ ఇస్తానంటూ ఆశజూపి ఆఖరి నిమిషంలో అన్యాయం చేశారంటూ వాపోయారు. నామినేషన్‌కు ఇవాళే ఆఖరి రోజు కావడంతో.. ఉమ చేసేది కూడా ఏం లేకుండా పోయింది. ఇప్పుడు ఆమె బీజేపీలో కంటిన్యూ అవుతారా.. వేరే డెసిషన్‌ తీసుకుంటారా అనేది సస్పెన్స్‌గా మారింది. అటు ఈటెల కూడా ఉమ పార్టీ మారకుండా ఎలాంటి హామీ ఇస్తారో చూడాలి.