ASSEMBLY ELECTIONS: కారుకి కలిసొస్తున్న 20 సీట్లు.. ఓట్లు చీల్చిపెడుతున్న కమలం

తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. కానీ ఇరవై నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించడానికి కమలం పార్టీ పరోక్షంగా సాయపడుతోంది. కాంగ్రెస్‌ను ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణలో అధికారంలోకి రానీయకూడదన్నది బీజేపీ ఆలోచన.

  • Written By:
  • Publish Date - November 29, 2023 / 04:33 PM IST

ASSEMBLY ELECTIONS: బీజేపీ, బీఆర్ఎస్ మధ్య సీక్రెట్ బంధం ఉందో లేదో తెలియదు. కానీ, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. ఇలా ఢిల్లీ నుంచి వచ్చిన లీడర్లు అంతా అదే పాట పాడారు. అసలు అలాంటి బంధం ఉందని కామెంట్ చేసేవాళ్ళని చెప్పుతో కొట్టండి అంటూ మొన్న ఫుల్లుగా ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇందులో నిజా నిజాలు ఎంత ఉన్నా.. పరోక్షంగా మాత్రం రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు 20 సీట్లల్లో విజయాన్ని బీజేపీయే అందిస్తోందని తెలుస్తోంది.

ASSEMBLY ELECTIONS: బీఆర్ఎస్‌కు ఆ రెండు గుర్తుల టెన్షన్‌.. సిద్ధిపేట, గజ్వేల్‌లోనే టార్గెట్‌..

తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. కానీ ఇరవై నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించడానికి కమలం పార్టీ పరోక్షంగా సాయపడుతోంది. కాంగ్రెస్‌ను ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణలో అధికారంలోకి రానీయకూడదన్నది బీజేపీ ఆలోచన. అలాగని బీఆర్ఎస్‌తో డైరెక్ట్‌గా పొత్తుపెట్టుకునే పరిస్థితి లేదు. మూడు నెలల క్రితం వరకూ రెండో స్థానంలో ఉన్న కమలం పార్టీ.. ఇప్పుడు థర్డ్ ప్లేస్‌కి పడిపోయింది. కానీ తెలంగాణలో పరిస్థితి బాగుంటే.. రేపు 2024లో పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎంపీ సీట్లు గెలుచుకోడానికి ఉపయోగపడేది. బీజేపీ 8 స్థానాలను మాత్రం జనసేనకు ఇచ్చి మిగతా అన్నింటిలో పోటీ చేస్తోంది. తమకు బలం ఉన్నా.. లేకున్నా అన్ని సీట్లల్లోనూ అభ్యర్థులను దింపేసింది. దాంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బాగా చీలిపోయే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో దాదాపు 20 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు కనీసం 10 వేలకు పైగానే ఓట్లు తెచ్చుకునే ఛాన్సుంది. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏ స్థాయిలో చీలిపోతుందో దీన్నిబట్టి అర్థమవుతుంది.

ఇప్పుడున్న టఫ్ ఫైట్‌లో చాలా నియోజకవర్గాల్లో వేలు, వందల ఓట్లతోనే ఫలితాలు తారుమారయ్యే అవకాశాలున్నాయి. అలాంటిది ప్రభుత్వ ఓట్లు చీలిపోతే అంతిమంగా లాభపడేది బీఆర్ఎస్ మాత్రమే. రాష్ట్రంలో ఏ పార్టీ వస్తుందో ఏమో గానీ.. చివర్లో BRSకు అనూహ్యంగా 20 సీట్లు అదనంగా లభించే అవకాశాలైతే ఉన్నయ్. బీఆర్ఎస్ ధైర్యం కూడా అదే. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతే తిరిగి తామే గెలుస్తాం.. తమకే అధికారం దక్కుతుంది అన్న ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుందని చాలా సంస్థలు రిపోర్టులు ఇచ్చినప్పటికీ.. ఈ ట్విస్ట్‌ని మాత్రం కనిపెట్టలేకపోయాయి. కనీసం 20 నియోజకవర్గాల్లో బీజెపి అభ్యర్థులకు ఒక్కో చోట పది వేల ఓట్లకు పైగానే వస్తాయి. ఈ ఓట్లతో కమలం పార్టీ అభ్యర్థులు ఎలాగూ గెలవరు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఇలా ముగ్గురు, నలుగురు అభ్యర్థులు చీల్చుకుంటే.. చివరికి అధికార పార్టీ అభ్యర్థే గెలవడం గ్యారంటీగా కనిపిస్తోంది.