BJP-JANASENA: పొత్తులు లేవా..? పవన్‌తో బీజేపీ తెగ తెంపులు..? నష్టం ఎవరికి..?

పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి పొత్తు ఉండదని జాతీయ నేతల సమక్షంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణలో పొత్తు లేదు సరే.. మరి ఆంధ్రప్రదేశ్ మాటేంటి అని కొత్త డౌట్స్ తలెత్తుతున్నాయి.

  • Written By:
  • Publish Date - December 15, 2023 / 06:58 PM IST

BJP-JANASENA: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ మళ్ళీ లోక్‌సభ ఎన్నికల్లో అలాంటి తప్పు చేయకూడదని నిర్ణయించింది. సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇది తెలంగాణ వరకే. మరి ఏపీలో కమలం, గ్లాస్ పార్టీలు కలుస్తాయా లేక విడి విడిగా పోటీ చేస్తాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొదట జనసేన పోటీ చేస్తుందని గానీ.. ఆ పార్టీతో పొత్తు ఉంటుందని గానీ.. బీజేపీ లీడర్లు అనుకోలేదు. కానీ 32 స్థానాల్లో తమ అభ్యర్థులను దించుతున్నామని, లిస్ట్ రెడీ అవుతోందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. దాంతో బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ పవన్‌ను కలిసి రాయబారం చేశారు.

YS JAGAN: ఏపీ అసెంబ్లీకి ముందే ఎన్నికలు.. కేబినెట్ భేటీలో జగన్ హింట్..!

బేరాలు ఆడుకొని చివరకు జనసేనకు 8 సీట్లు ఇస్తామని ప్రకటించారు. సీమాంధ్రుల ప్రభావం ఉంటుందని భావించిన హైదరాబాద్‌తో పాటు, ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఈ సీట్లు కేటాయించారు. ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాతో కలిసి పవన్ కల్యాణ్.. బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లో కూడా పాల్గొన్నారు. పవన్ ఇమేజ్ తమకు కలిసి వస్తుందని కమలం పార్టీ నేతలంతా తెగ ఖుషీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వెల్లడయ్యాక గానీ బీజేపీకి అసలు తత్వం బోధపడలేదు. జనసేనకు అసలు తెలంగాణలో బలం లేదనీ, ఆ పార్టీతో పొత్తు వల్ల రెండు పార్టీలకు నష్టమే జరిగిందని అర్థమైంది. పైగా జనసేన పోటీచేసిన 8 స్థానాల్లో బీజేపీ అభిమానులు, కార్యకర్తలు ఓట్లే వేయలేదని తేలింది. గతంలో బీజేపీకి భారీగా ఓట్లు పడిన చోట కూడా జనసేనను జనం ఆదరించలేదు. దాంతో తెలంగాణలో పవన్ మేనియా పనిచేయదని బీజేపీ నేతలకు తెలిసొచ్చింది.

PRAJAVANI TENSION: ప్రజావాణితో కొత్త టెన్షన్.. భారీ క్యూలైన్లతో జనం పరేషాన్.. పరిష్కారం ఏంటి..?

అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి పొత్తు ఉండదని జాతీయ నేతల సమక్షంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణలో పొత్తు లేదు సరే.. మరి ఆంధ్రప్రదేశ్ మాటేంటి అని కొత్త డౌట్స్ తలెత్తుతున్నాయి. పవన్ కల్యాణ్ తాను ఇప్పటికీ NDA లోనే ఉన్నానని చెబుతున్నారు. కానీ వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీలో టీడీపీతో కలసి పోటీ చేయబోతోంది జనసేన. అయితే టీడీపీతో తాము కూడా కలుస్తామని బీజేపీ అయితే ఇప్పటి దాకా ప్రకటించలేదు. తెలంగాణలో ఎలాగూ పవన్ పార్టీతో తెగతెంపులు చేసుకున్న బీజేపీ.. ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే వ్యూహంతో ముందుకెళ్తుందని భావిస్తున్నారు. అక్కడ కూడా బీజేపీ ఒంటరి పోరు చేస్తుందని అంచనాలున్నాయి. కానీ, జనసేన లీడర్లు మాత్రం తెలంగాణ వేరు.. ఆంధ్రప్రదేశ్ వేరు.. ఇక్కడి పొత్తుల సంగతి బీజేపీ జాతీయ నాయకత్వం డిసైడ్ చేస్తుందని చెబుతున్నారు. కానీ, టీడీపీతో పొత్తు తర్వాత జనసేనకు వచ్చేవే కొన్ని సీట్లు.

మళ్ళీ వాటిల్లో బీజేపీకి ఇవ్వడం అనేది సాధ్యం కాదు. పరస్పర ప్రయోజనం లేకుండా బీజేపీ ఈ సీట్ షేరింగ్‌కి ఎందుకు ఒప్పుకుంటుంది. ఈ పొత్తుతో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఉపయోగం ఉండదు. అందువల్ల లోక్‌సభ ఎన్నికలకైనా జనసేనతో కలవాలని ఎందుకు అనుకుంటుంది..? బీజేపీకి అసెంబ్లీలో తక్కువ సీట్లు వచ్చినా దేశం విషయానికి వచ్చేసరికి నరేంద్రమోడీని చూసి ఏపీ ఓటర్లు బీజేపీకి ఓట్లు వేస్తారని నమ్మకం ఉంది. అందువల్ల పవన్‌తో కలిస్తే ఎంత..? కలవకపోతే ఎంత..? అని కమలం పార్టీ అధిష్టానం భావిస్తోందని అంటున్నారు.