Deepa Dasmunsi: టైం బాబూ.. టైం.. బ్యాడ్ టైం. పొజిషన్‌లో ఉన్నా, అపోజిషన్‌లో ఉన్నా.. మాకే ఎందుకిలా అన్నట్టుగా ఉందట తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్‌ల వ్యవహారం. అయితే సొంత పార్టీ నేతలు.. లేదంటే ప్రత్యర్థి పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతుండటంతో.. అసలెందుకిలా జరుగుతోందన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీకి ఇన్ఛార్జ్‌లుగా వచ్చిన ముగ్గురు కేంద్ర పెద్దలపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీపై కూడా ఆరోపణలు వెల్లువెత్తడం తెలంగాణ కాంగ్రెస్‌ను డిస్ట్రబ్ చేస్తోంది. గత రెండు రోజులుగా ఆమె మీద ఆరోపణలు చేస్తోంది బీజేపీ.
Nara Bhuvaneswari: భువనేశ్వరి సరదా కామెంట్స్.. బాబుని ఆటాడుకుంటున్న వైసీపీ !
తెలంగాణ కాంగ్రెస్‌కి మూడేళ్ళ క్రితం ఇన్చార్జిగా వచ్చారు మాణిక్కం ఠాకూర్. ఆయన రావడంతోనే అప్పట్లో పిసిసి చీఫ్‌గా ఉన్న ఉత్తమ్‌ని మార్చి రేవంత్‌రెడ్డిని నియమించింది పార్టీ. ఆ తర్వాత జరిగిన పరిణామాలు పెద్ద దుమారాన్నే లేపాయి. ఠాకూర్‌పై సొంత పార్టీ నేతలే తీవ్ర ఆరోపణలు చేశారు. పీసీసీ చీఫ్ పదవిని అమ్ముకున్నారంటూ కాంగ్రెస్ నేతలు నాడు చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున దుమారం రేపాయి. ఆ తర్వాత ఢిల్లీ నుంచి దిగ్విజయ్ సింగ్ వచ్చి.. ఇష్యూని సెటిల్ చేయాల్సి వచ్చింది. ఠాకూర్‌ని మార్చిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఎన్నికలకు ముందు అందర్నీ కలుపుకొనిపోయే నాయకుడు అవసరమని భావించింది. అందుకే మహారాష్ట్రకు చెందిన మాణిక్‌రావ్ థాక్రేని ఇంపోర్ట్ చేసింది. పార్టీలో నాయకులు అందర్నీ కలుపుకొని పోతూ.. చెప్పింది వింటూ కొంత సవ్యంగానే నడుపుకొంటూ వచ్చారాయన. కానీ సరైన కారణం ఏదీ చెప్పకుండానే, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాగానే థాక్రేని మార్చేసింది ఏఐసీసీ.
PAWAN KALYAN: అంత మాట అనేశాడే ! పవన్‌పై టీడీపీ గరంగరం.. బతిమలాడుకుంటున్న బాబు
థాక్రేని ఎందుకు మార్చారన్నది ఇప్పటికీ తెలియదంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. అధికారంలోకి రావడానికి అందర్నీ కలుపుకొని పనిచేసిన థాక్రేకి ప్రాధాన్యం పెంచారని అనుకున్నా.. పార్టీ హవాలేని గోవాకు ఇన్చార్జిగా పంపింది అధిష్టానం. దీంతో ఆయన్ని ఎందుకు అలా పంపారన్నది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్‌గానే ఉంది. థాక్రే తర్వాత ఇన్చార్జిగా వచ్చారు దీపాదాస్ మున్షీ. ఆమె పార్టీకి మంచి లాయలిస్ట్ అని, కమిట్‌మెంట్‌తో పని చేస్తారన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. అయితే గడిచిన రెండు రోజులుగా దీపాదాస్‌పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది బీజేపీ. కాంగ్రెస్ నేతలు.. తమ ఇన్చార్జికి బెంజ్ కార్లు కొనిచ్చారంటూ ఆరోపిస్తున్నారు బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్. అందుకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు కొందరు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. కానీ.. ఈ ఆరోపణలపై పార్టీ జాతీయ నాయకత్వంలో కూడా చర్చ జరుగుతున్నట్టు సమాచారం.
బెంజ్‌కారు ఇచ్చారా లేదా అన్న వ్యవహారాన్ని పక్కనబెడితే.. అసలు ఇలాంటి ప్రచారం ఎక్కడ, ఎందుకు మొదలైందన్న చర్చ కాంగ్రెస్‌లో జరుగుతోంది. దీని వెనక సొంత పార్టీ నేతలే ఉన్నారా అన్న అనుమానం పెరుగుతోందట. ఇలా.. తెలంగాణ కాంగ్రెస్‌కి వచ్చిన ప్రతి ఇన్ఛార్జ్ ఏదో ఒక రూపంలో ఇరకాటంలో పడటం ఇప్పుడు పార్టీలో హాట్ సబ్జెక్ట్ అయింది. గతం సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుత ఇన్ఛార్జ్‌పై వచ్చిన బెంజ్ కారు ఆరోపణల్ని కూడా పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంటుందా..? లేక పవర్‌లో ఉన్నాం కాబట్టి లైట్ తీసుకుందామని వదిలేస్తుందా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.