PM MODI: మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి 400కుపైగా సీట్లు గెలుస్తుందని పార్లమెంట్ సాక్షిగా మోదీ చెప్పారు. బీజేపీ కూడా మిషన్ 400 అంటూ పని చేస్తోంది. ఈ విషయంలో మోదీ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్‌కు 40 సీట్లు మించవని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని కూడా ప్రస్తావించారు. మరి మోదీ అంచనాకు తగ్గట్లే బీజేపీ విజయం సాధిస్తుందా..? మోదీ హవా పని చేస్తుందా..? ఈ విషయంలో ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపిస్తున్న స్పందనే సాక్ష్యం.
KCR: అసెంబ్లీకి కేసీఆర్ వస్తారా.. రారా.. కారణమేంటి..?
బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దగా పట్టులేదు. తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో బీజేపీకి పెద్దగా ఆదరణ లేదు. ఇక్కడ కాంగ్రెస్‌తోపాటు ప్రాంతీయ పార్టీలదే హవా. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీలో వైసీపీ, తమిళనాడులో డీఎంకే, కేరళలో సీపీఎం అధికారంలో ఉన్నాయి. అందువల్ల వీటిని తట్టుకుని బీజేపీ నిలబడటం కష్టం. కానీ, ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం బీజేపీదే విజయం. అక్కడ మోదీ హవా కొనసాగుతోంది. ఈ విషయాన్ని ఇండియా టుడే.. ఇటీవల నిర్వహించిన సర్వేలో కూడా తేలింది. మూడ్ ఆఫ్ ది నేషన్ 2024 పేరుతో విడుదలైన ఈ సర్వేలో.. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి, మిత్రపక్షాలకు తిరుగులేదని తేలింది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ఇక్కడ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది. దీంతో మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని సర్వే తేల్చింది. అలాగే ప్రతిపక్ష కూటమి ఇండియా లేదా కాంగ్రెస్, ఇతర పక్షాలు ఇక్కడ పెద్దగా ప్రభావం చూపబోవని తేలింది. వీటి ప్రభావం అంతంతమాత్రమే. సర్వే ప్రకారం సీట్ల వివరాలిలా ఉన్నాయి.
బిహార్‌లో 40 సీట్లు ఉండగా ఎన్డీయే కూటమి 32 సీట్లు, ఇండియా కూటమి 8 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. గతంలో ఎన్డీయే కూటమికి ఇక్కడ 39 స్థానాలొచ్చాయి. అయితే, ఈసారి సీట్ల సంఖ్య తగ్గొచ్చు. పశ్చిమ బెంగాల్‌లో 42 ఎంపీ సీట్లు ఉండగా, బీజేపీకి 19, టీఎంసీకి 22 రావొచ్చు. ఉత్తర ప్రదేశ్‌లో 80 సీట్లు ఉండగా బీజేపీకి 70, ఇండియా కూటమికి 10 సీట్లు రావొచ్చు. హిమాచల్ ప్రదేశ్‌లో 4 సీట్లు ఉండగా అవన్నీ బీజేపీకి దక్కుతాయి. జమ్ము కాశ్మీర్‌లో 5 సీట్లకుగాను బీజేపీకి 2, ఇండియా కూటమికి 3 సీట్లు, హరియాణాలో 10 సీట్లకుగాను బీజేపీకి 8 సీట్లు, కాంగ్రెస్‌కు 2 సీట్లు, పంజాబ్‌లో 13 సీట్లకుగాను బీజేపీకి 2, ఆమ్ ఆద్మీకి 5, కాంగ్రెస్‌కు 5, ఎస్‌ఏడీకి 1 సీటు, ఉత్తరాఖండ్‌లో 5 సీట్లకుగాను బీజేపీకి 5, ఝార్ఖండ్‌లో 14 సీట్లకుగాను బీజేపీకి 12, ఇండియా కూటమికి 2, అస్సాంలో 14 సీట్లకుగాను బీజేపీకి 12, ఇండియా కూటమికి 2, కర్ణాటకలో 28 సీట్లకుగాను బీజేపీకి 24, కాంగ్రెస్‌కు 4, తమిళనాడులో 39 సీట్లకుగాను ఇండియా కూటమికి 39 సీట్లు, ఏపీలో 25 సీట్లకుగాను టీడీపీ కూటమికి 17, వైసీపీకి 8, తెలంగాణలో 17 సీట్లకుగాను కాంగ్రెస్‌కు 10, బీజేపీకి 3, బీఆర్ఎస్‌కు 3 సీట్లు, ఢిల్లీలో 7 సీట్లకుగాను బీజేపీకి 7, కేరళలో 20 సీట్లకుగాను ఇండియా కూటమి (కాంగ్రెస్, సీపీఎం)కి 20 సీట్లు దక్కుతాయి. ఈ లెక్కన దక్షిణాది రాష్ట్రాలు మినహా అన్ని చోట్ల బీజేపీ గణనీయమైన సీట్లు లేదా గౌరవనీయమైన సీట్లు దక్కించుకుంటుంది. దీంతో మరోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయం.