BJP Manifesto: ప్రచారం విషయంలో రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కంటే కాస్త వెనక ఉంది బీజేపీ. అభ్యర్థులను కూడా అన్ని పార్టీలు ప్రకటించిన తరువాతే ప్రకటించింది. ఓ పక్క నెమ్మదిగా సాగుతున్న ప్రచారం.. మరోపక్క సీనియర్ నేతలు పార్టీని వీడుతుండటంతో.. బీజేపీ కార్యకర్తలు డీలాపడిపోయారు. వాళ్లందరిలో మళ్లీ జోష్ నింపేందుకు సెంట్రల్ హోం మినిస్టర్ అమిత్ షా ఎల్లుండి తెలంగాణకు రాబోతున్నారు. కార్యకర్తలకు ధైర్యం చెప్పడంతోపాటు తెలంగాణలో బీజేపీ మేనిఫెస్టోను కూడా అమిత్ షా ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది.
Congress Manifesto: కాంగ్రెస్ మేనిఫెస్టో రెడీ.. కీలక హామీలివే..!
ఇప్పటికే మేనిఫెస్టో రెడీ అయినట్టు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయడం.. మహిళలకు 5 వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం లాంటి కీలక అంశాలను బీజేపీ మేనిఫెస్టోలో చేర్చినట్టు సమచారం. ఇక రైతులు, విద్యార్థులు, మహిళలకు సంబంధించి కూడా బీజేపీ మేనిఫెస్టోలో కీలక అంశాలు చేర్చినట్టు చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ తమ మేనిఫెస్టోను ప్రకటించాయి. అధికారంలోకి వస్తే చేసే పనులను ప్రజలకు వివరిస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు ఇరు పార్టీల నేతలు. ఇప్పుడు బీజేపీ.. ఆ రెండు పార్టీలకు ధీటుగా తన మేనిఫెస్టోను తయారు చేసినట్టు తెలుస్తోంది. మిగిలిన రెండు పార్టీలతో కంపేర్ చేస్తే బీజేపీ కాస్త వెనుకంజలో ఉంది.
ఇప్పుడు పార్టీ అధిష్టానం రిలీజ్ చేయబోతున్న మేనిఫెస్టోలో పార్టీలో, కార్యకర్తల్లో కొత్త జోష్ వస్తుందని భావిస్తున్నారు బీజేపీ నేతలు. ఎల్లుండి తెలంగాణకు రానున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు జిల్లాల్లో పర్యటించబోతున్నారు. గద్వాల, వరంగల్ ఈస్ట్, నల్గొండలో జరగబోయే సకలజనుల సంకల్ప సభల్లో పాల్గొనబోతున్నారు. ఈ సభలోనే బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసే చాన్స్ ఉంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ను మించి బీజేపీ ఎలాంటి హామీలు ఇవ్వబోతోంది.. ఈ మేనిఫెస్టోలో ప్రజల్లో మళ్లీ బీజేపీ బలం పెరుగుతుందా చూడాలి మరి.