నా బాటిల్స్ ఫ్రెండ్స్ తాగేశారు: ఏపీ అసెంబ్లీలో బీజేపి ఎమ్మెల్యే

బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. చట్టంలో ఇంట్లో 6 మధ్యం బాటిళ్లు మాత్రమే పెట్టుకోవడానికి అనుమతి ఉందన్న ఆయన... గత ప్రభుత్వ హయంలో ఒక్క బాటిల్ ఎక్కవ ఉన్నా జగన్ జైల్లో వేసేస్తాడనీ పెట్టుకోలేదని తెలిపారు.

  • Written By:
  • Publish Date - November 15, 2024 / 11:52 AM IST

బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. చట్టంలో ఇంట్లో 6 మధ్యం బాటిళ్లు మాత్రమే పెట్టుకోవడానికి అనుమతి ఉందన్న ఆయన… గత ప్రభుత్వ హయంలో ఒక్క బాటిల్ ఎక్కవ ఉన్నా జగన్ జైల్లో వేసేస్తాడనీ పెట్టుకోలేదని తెలిపారు. మంచి మధ్యం అక్కడా ఇక్కడా తెచ్చి ఇంట్లో ఆరు బాటిళ్ళు పెట్టుకొని మిగలినవి దాచిపెట్టమని ప్రెండ్స్ కు ఇచ్చేవాళ్లమన్న ఆయన… అయితే వారు తమకు గిప్ట్ గా ఇచ్చారనుకొని ఖాళీ చేసే వారని చెప్పడంతో సభలో నవ్వులు విరిశాయి.

ఇది చాలా పెద్ద సమస్య కాబట్టి బిజినెస్ హౌస్ లకు అయినా ఈ కోటా పెంచాలని ఎక్సైజ్, హోంశాఖామంత్రులను కొరుతున్నా అంటూ వ్యాఖ్యలు చేసారు. ఈ విషయం సభలో చెప్పోద్దు బాగోదు అని మా వాళ్లు అన్నారన్న ఆయన… అయితే ఇది చాలా ఇబ్బంది పడే విషయం అందుకే సభ దృష్టికి తీసుకువచ్చానని తెలిపారు. స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్లు నుండి వచ్చే ఆదాయం 4000 కోట్లు పెంచి చూపించారు అది ఎలా వస్తుంది అని నిలదీశారు.