Raja Singh: ఏమన్నా ప్లాన్..? సికింద్రాబాద్‌పై రాజాసింగ్ కన్ను.. కిషన్ రెడ్డి సీటుకు ఎర్త్..!

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయమని పార్టీ అడిగితే.. సికింద్రాబాద్ సీటు అడుగుతా అంటున్నారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీని ఢీకొట్టడానికి తనకంటే కిషన్ రెడ్డి బెటర్ అంటూ.. అడ్డంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - February 27, 2024 / 02:02 PM IST

Raja Singh: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీటుకు ఎర్త్ పెట్టారు రాజాసింగ్. సికింద్రాబాద్ బీజేపీ టిక్కెట్ ఇస్తే నిలబడతానని అంటున్నాడు. ప్రస్తుతం ఆయన గోషామహల్ ఎమ్మెల్యే కావడంతో.. బీజేపీ హైకమాండ్ ఆయన్ని హైదరాబాద్ నుంచి పోటీకి నిలబెడుతుందన్న టాక్ నడుస్తోంది. రాజా సింగ్ మాత్రం వేరే ఆలోచనలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయమని పార్టీ అడిగితే.. సికింద్రాబాద్ సీటు అడుగుతా అంటున్నారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీని ఢీకొట్టడానికి తనకంటే కిషన్ రెడ్డి బెటర్ అంటూ.. అడ్డంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి వినయంగా ఉంటూనే సికింద్రాబాద్ సీటుపై కన్నేశారు ఎమ్మెల్యే రాజాసింగ్.

Pawan Kalyan sold assets : ఆస్తులు అమ్మేస్తున్న పవన్ కల్యాణ్…. !

హైదరాబాద్ నియోజకవర్గంలో 4 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయి. వాటిని తొలగించకుండా అక్కడ ఎవరు పోటీచేసినా గెలవరు. కిషన్ రెడ్డి ముందు వాటి గురించి మాట్లాడాలని అంటున్నారు రాజాసింగ్. అక్కడ పోటీకి తనకంటే పార్టీలో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారనీ.. కిషన్ రెడ్డి ఒక్కసారి హైదరాబాద్ నియోజకవర్గంలో మాట్లాడితే 200శాతం గెలవడం గ్యారంటీ అంటున్నారు. పైగా తనకు సికింద్రాబాద్ ఇస్తే పోటీకి రెడీ అంటున్నారు రాజాసింగ్. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఈసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఆ నియోజకవర్గంలో.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా గెలవలేదు. పైగా ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి బలమైన అభ్యర్థులు బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ఈమధ్యే గులాబీ పార్టీకి గుడ్ బై కొట్టి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌కి సికింద్రాబాద్ సీటు ఇస్తారని అంటున్నారు. తనకు సామాజిక వర్గం అండ ఉందనీ.. గతంలో మేయర్‌గా పనిచేసిన అనుభవంతో గెలుపు గ్యారంటీ అంటున్నారు బొంతు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో 35శాతం మైనార్టీల ఓట్లు కూడా తనకే కలిసొస్తాయని ధీమాగా చెబుతున్నారు.

బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పోటీ చేయించే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో కిషన్ రెడ్డికి ఈసారి గట్టి పోటీయే ఉండే అవకాశం ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను దించి కిషన్ రెడ్డికి అప్పగించిన తర్వాత పార్టీ వర్గాలుగా విడిపోయింది. బండికి దగ్గర వ్యక్తిగా ఉన్నారు ఎమ్మెల్యే రాజా సింగ్. అందుకే ఇప్పుడు కిషన్ రెడ్డి సీటును ఈ విధంగా లాక్కోవాలని పార్టీలో ఓ వర్గం ప్లానేసినట్టు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కాదని.. రాజా సింగ్‌కి సీటు ఇచ్చే పరిస్థితి అయితే బీజేపీ హైకమాండ్ చేయదు. పైగా ఈనెలాఖరులో ప్రకటించే ఫస్ట్ లిస్టులోనే కిషన్ రెడ్డి పేరు ఉంటుందని అంటున్నారు. మరి అలాంటప్పుడు సికింద్రాబాద్ సీటును రాజాసింగ్ ఎందుకు అడుగుతున్నారు..? ఏం మతలబు ఉందని బీజేపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.