Raghu Rama Krishna Raju: రఘురామకు బీజేపీ ఝలక్‌.. ప్రభాస్ ఫ్యామిలీకే నరసాపురం టికెట్‌!

నరసాపురం ఎంపీ రఘురామ.. వైసీపీకి రాజీనామా చేశారు. ఐతే వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన భావించారు. ఐతే ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదరడంతో.. కమలం పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. ఐతే బీజేపీ ఆలోచన మాత్రం ఇంకోలా ఉంది.

  • Written By:
  • Publish Date - March 11, 2024 / 04:53 PM IST

Raghu Rama Krishna Raju: టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పొత్తు వ్యవహారం.. ఏపీ రాజకీయాలను మలుపుల మీద మలుపులు తిప్పుతున్నాయ్. టీడీపీ, జనసేన మధ్య టికెట్ల వ్యవహారంపై ఇప్పటికే ఓ క్లారిటీ రాగా.. ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదరడంతో.. సీట్ల సర్దుబాటులో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయ్. దీనికి సంబంధించి ఇప్పటికే మూడు పార్టీల మధ్య భేటీ కూడా మొదలైంది. బీజేపీ పొత్తులో చేరడంతో.. జనసేన ఓ సీటు త్యాగం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

TTD BOARD: టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు.. వారి దర్శనాలపై పరిమితి

మొత్తం 2 ఎంపీ స్థానాల్లో మాత్రమే పవన్ పార్టీ పోటీ చేసే చాన్స్ ఉంది. తమకు కనీసం ఆరు పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని బీజేపీ డిమాండ్ చేస్తుండడంతో.. తప్పనిసరి పరిస్థితిలో జనసేన 2ఎంపీ సీట్లకే పరిమితం కాబోతోంది. ఇక అటు నరసాపురం ఎంపీ రఘురామ.. వైసీపీకి రాజీనామా చేశారు. ఐతే వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన భావించారు. ఐతే ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదరడంతో.. కమలం పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. ఐతే బీజేపీ ఆలోచన మాత్రం ఇంకోలా ఉంది. రఘురామకు టికెట్ ఇచ్చేందుకు.. కమలం పార్టీ ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించడం లేదు. బీజేపీ మాజీ ఎంపీ కృష్ణంరాజు భార్య శ్యామల దేవికి.. లేదంటే హీరో ప్రభాస్ సోదరుడు నరేంద్ర వర్మకు.. టికెట్ ఇచ్చేందుకు కమలం పార్టీ పెద్దలు ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరితో బీజేపీ నేతలు సంప్రదింపులు కూడా జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ప్రభాస్‌కు ఉన్న సినీ ఇమేజ్‌ను ఉపయోగించుకొని.. ఎన్నికల్లో మరింత ప్రభావం చూపించేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందుకే ఈ టికెట్‌ ప్రభాస్ కుటుంబానికి కేటాయించాలని చూస్తోంది. దీంతో నరసాపురం టికెట్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్న రఘురామ రాజు అశలు అడియాశలు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఆయన ఏం చేస్తారు.. ఎలాంటి అడుగులు వేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.