BJP Operation Akarsh: బీఆర్ఎస్ నుంచి వలసలు.. మరో ఇద్దరికి బీజేపీ ఆఫర్ !

ఇప్పటికే ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీలను తమ పార్టీలోకి లాక్కొని వెంటనే వాళ్ళకి బీజేపీ టిక్కెట్లు ఇచ్చేశారు. జహీరాబాద్ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన బీబీ పాటిల్ కారుకు గుడ్ బై కొట్టి బీజేపీలోకి చేరగానే ఎంపీ టిక్కెట్ కన్ఫామ్ చేసింది అధిష్టానం.

  • Written By:
  • Publish Date - March 8, 2024 / 05:33 PM IST

BJP Operation Akarsh: తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. జనంలో పలుకుబడి ఉండి బీఆర్ఎస్‌లో ఇమడలేకపోతున్న లీడర్లను టార్గెట్ చేస్తోంది. అందులో భాగంగా మహబూబాబాద్ కు చెందిన సీతారాం నాయక్ తోపాటు, ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంకట్రావుతో సంప్రదింపులు మొదలుపెట్టింది. ఇద్దరికీ ఎంపీ టిక్కెట్లు ఇస్తామని బీజేపీ ఆఫర్ ఇస్తోంది. ఈ ఇద్దరు లీడర్లూ కమలం పార్టీలో చేరేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు తెలుస్తోంది.

MALLAREDDY: రేవంత్‌ దెబ్బ.. మల్లన్న అబ్బ.. చేతులెత్తేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి..

ఇప్పటికే ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీలను తమ పార్టీలోకి లాక్కొని వెంటనే వాళ్ళకి బీజేపీ టిక్కెట్లు ఇచ్చేశారు. జహీరాబాద్ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన బీబీ పాటిల్ కారుకు గుడ్ బై కొట్టి బీజేపీలోకి చేరగానే ఎంపీ టిక్కెట్ కన్ఫమ్ చేసింది అధిష్టానం. అలాగే నాగర్ కర్నూల్ BRS ఎంపీ రాములు కమలం పార్టీలో చేరగానే ఆయన కొడుకు భరత్‌కు టిక్కెట్ ఇచ్చింది. ఇప్పుడు మరో ఇద్దరు కీలక నేతలను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ. మహబూబ్ బాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇంటికి వెళ్ళి కలిశారు పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఆ నియోజకవర్గం టిక్కెట్ ను బీఆర్ఎస్ ఈసారి కూడా మాలోతు కవితకే కేటాయించింది. దాంతో సీతారాం నాయక్ బీఆర్ఎస్ అధిష్టానంపై కోపంగా ఉన్నారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అందుకే సీతారాం నాయక్‌ను చేర్చుకొని మానుకోట టిక్కెట్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. 2014లో ఇదే స్థానం నుంచి బీఆర్ఎస్ నుంచి సీతారాం నాయక్ గెలిచారు.

తర్వాత 2019లో మాత్రం మాలోతు కవితకు సీటు ఇచ్చారు కేసీఆర్. ఇప్పుడు కూడా మళ్ళీ ఆమెకే కేటాయించారు. ఖమ్మం జిల్లాలో గులాబీ జెండా పట్టుకున్న వాళ్ళే లేని టైమ్‌లో ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక వ్యక్తి జలగం వెంకట్రావు. కారు పార్టీ కొత్తగూడెం టిక్కెట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ మోసం చేయడంతో.. ప్రస్తుతం ఆయన ఖాళీగా ఉన్నారు. అందుకే జలగంతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో చర్చలు జరిపారు. బీజేపీలోకి వస్తే ఖమ్మం పార్లమెంట్ టిక్కెట్ ఇస్తామని చెప్పారు. దాంతో జలగం వెంకట్రావు కూడా కమలం పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.