BJP Add Campaign: యాడ్స్ కోసం బీజేపీ రూ.30 కోట్లు ఖర్చు ! రూపాయి ఖర్చుపెట్టని బీఆర్ఎస్, కాంగ్రెస్ !

గత రెండు నెలలుగా ప్రభుత్వ ప్రకటనలతో పాటు బీజేపీ సొంతంగా అడ్వర్టయిజ్ మెంట్స్ పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తోంది. జనవరి ఫస్ట్ నుంచి ఇప్పటి దాకా రెండున్నర నెలల్లో ఆ పార్టీ గూగుల్, ఫేస్‌బుక్ లాంటి డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో 30 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేసింది.

  • Written By:
  • Publish Date - March 14, 2024 / 12:58 PM IST

BJP Add Campaign: సార్వత్రిక ఎన్నికల ప్రకటనల కోసం దేశవ్యాప్తంగా బీజేపీ భారీ ఎత్తున డబ్బులు ఖర్చు చేస్తోంది. డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో గత జనవరి నెల నుంచి ఇప్పటి దాకా రెండున్నర నెలల్లో దేశంతో పాటు తెలంగాణలో కూడా కలిపి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. బీజేపీ సహా అన్ని పార్టీలు కలిపి రూ.76 కోట్లను ఫేస్ బుక్, గూగుల్ ప్లాట్ ఫామ్స్‌కు చెల్లించాయి. 400 సీట్లు సాధించి కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని మంచి ఊపు మీద ఉన్న బీజేపీ ఎక్కడా తగ్గడం లేదు. గత రెండు నెలలుగా ప్రభుత్వ ప్రకటనలతో పాటు బీజేపీ సొంతంగా అడ్వర్టయిజ్ మెంట్స్ పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తోంది.

DPS Praneeth Rao Arrest : ట్యాపింగ్ చేయించిన ప్రభుత్వ పెద్దలు ఎవరు ? వాట్సాప్ ఛాట్ కూడా సేకరణ !!

జనవరి ఫస్ట్ నుంచి ఇప్పటి దాకా రెండున్నర నెలల్లో ఆ పార్టీ గూగుల్, ఫేస్‌బుక్ లాంటి డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో 30 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేసింది. గూగుల్ యాడ్స్ ట్రాన్స్ పరెన్సీ సెంటర్, ఫేస్ బుక్ యాడ్ లైబ్రరీ ఈ లెక్కలను వెల్లడించాయి. బీజేపీతో పాటు అన్ని పార్టీలు కలిపి దాదాపు రూ.76 కోట్లు ఖర్చుపెట్టాయి. ఇందులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమిషన్ 29 కోట్ల రూపాయలు, YSRCP తరపున ఐప్యాక్ టీమ్ 4 కోట్లు, ఒడిశా ఐటీ డిపార్ట్ మెంట్ 2.7 కోట్లు, డీఎంకేకి చెందిన పాపులస్ ఎంపవర్ మెంట్ నెట్ వర్క్.. 1.7 కోట్లు, బిజూ జనతాదళ్ పార్టీ కోటి రూపాయలను ఖర్చుపెట్టాయి. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో ఇప్పటిదాకా 36 లక్షలను ఖర్చుపెట్టింది. ఒక్క తెలంగాణలో అన్ని పొలిటికల్ పార్టీలు కలసి 3.1 కోట్లు ప్రకటనల కోసం ఖర్చుపెట్టాయి. ఇందులోనూ రూ.1.1 కోట్లతో బీజేపీ ఫస్ట్ ప్లేసులో ఉంది. CBC 86 లక్షలు, ఐప్యాక్ టీమ్ 60 లక్షలు, టీడీపీ 16 లక్షలు ఖర్చుపెట్టాయి.

చిత్రం ఏంటంటే.. తెలంగాణలో ధనిక పార్టీ అయిన బీఆర్ఎస్, అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఈ రెండు పార్టీలు సార్వత్రిక ఎన్నికల ప్రకటనలకు ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటిదాకా గూగుల్, ఫేస్ బుక్ ప్లాట్ ఫామ్స్‌లో రూ.5.65 కోట్ల రూపాయలను యాడ్స్ కోసం ఖర్చు చేశారు. ఇందులో YCP తరపున ఐప్యాక్ టీమ్ రూ.3.6 కోట్లు యాడ్స్ కి చెల్లించింది. CBC (కేంద్ర ప్రభుత్వం తరపున) 81 లక్షలు, బీజేపీ తరపున 76 లక్షలు ఖర్చయ్యాయి. వైసీపీ సొంతంగా 17 లక్షలు, టీడీపీ 16 లక్షలు ఖర్చు చేశాయి. ఎన్నికల ప్రకటనల్లో ముందుండే ధనిక పార్టీ బీఆర్ఎస్ ఈసారి అధికారం కోల్పోవడంతో నయా పైసా బయటకు తీయలేదు. లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులే దొరకని పరిస్థితుల్లో ఉంది. దాంతో డబ్బులు బయటకు తీయడం లేదని తెలుస్తోంది.