Bollam Mallaiah Yadav: సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకు ఈసారి కోదాడలో ఓటమి తప్పదా..? మరోసారి మల్లయ్యకు ఓటు వేస్తే కోదాడ పని మటాషేనా..? మల్లయ్యకు టికెట్ ఇవ్వొద్దంటూ సొంత పార్టీ కార్యకర్తలే కరపత్రాలు పంచేవరకూ వెళ్లిందంటే ఆయన టార్చర్ ఆ రేంజ్‌లో ఉంటుందా..? ఇప్పుడు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గురించి ఇదే హాట్ టాపిక్. 2018లో అనూహ్యంగా ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న బొల్లం మల్లయ్య యాదవ్.. కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై స్వల్ప ఓట్ల తేడాతో గెలిచారు. గెలిచిన కొన్ని రోజులకే మల్లయ్యపై ఆరోపణలు తుఫానులా వచ్చాయి. సొంత పార్టీ నేతలను ఇబ్బందులు పెడుతూ.. అక్రమార్కులను పక్కన చేర్చుకుంటున్నారంటూ లోకల్ కేడర్ అసంతృప్తితో రగిలిపోయింది.
Mohammed Feroz Khan: ఎంఐఎంకు ఫిరోజ్‌ఖాన్ చెక్ పెడతారా..? ఈసారైనా విజయం దక్కేనా..?
నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్న సీనియర్ నేతల్లో.. మాజీ ఎమ్మెల్యే మేనేపల్లి చందర్ రావు, ఉద్యమ నేత కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డికి ప్రాధాన్యం తగ్గించడం.. పార్టీ కార్యకర్తల్లో వాళ్ల ప్రధాన్యం తగ్గించి సీనియర్లను దూరం పెట్టేశారు బొల్లం. పార్టీ కోసం కష్టపడ్డవారికి కాకుండా.. తన సొంత మనుషులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇప్పించుకున్నారట. తన మాట వినని సర్పంచ్‌లను కూడా నిధుల విషయంలో ఇబ్బందులకు గురి చేశారట. ఇక కోదాడ మున్సిపల్ చైర్మన్ శిరీష లక్ష్మీనారాయణపై బహిరంగంగానే కక్ష సాధింపుకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో కొంత కాలంపాటు కౌన్సిలర్లు మల్లయ్యకు వ్యతిరేకంగా పని చేశారు. కేటీఆర్ మళ్లీ కలుగజేసుకుని వాళ్ల మధ్య సయోధ్య కుదిర్చారు. ఇక కోదాడ ఎంపీపీ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది.
ఎమ్మెల్యే అండతో ప్రతీ విషయంలో ఆమె కలుగజేసుకుంటోందని స్థానిక నేతలు అరోపిస్తున్నారు. కేడర్ నుంచి వ్యతిరేకత ఇలా ఉంటే.. ఇక నియోజకవర్గంలో మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే కనుసన్నల్లోనే మట్టి, రేషన్ మాఫియా జరుగుతోందని అంతా అంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే స్వయంగా ఎమ్మెల్యేనే రంగంలోకి దిగడం, కేసులు పెట్టించడం చేయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బొల్లం ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత అక్రమార్కుల చేతికి కత్తి ఇచ్చినట్టు అయ్యిందనే టాక్ ఉంది. ల్యాండ్ సెటిల్‌మెంట్లు, పంచాయితీలకు కోదాడ కేరాఫ్ అడ్రస్‌గా మారిందంటున్నారు అక్కడి ప్రజలు. ఈ విషయంలో పోలీసులు కూడా పట్టించుకోవడంలేదని స్థానికులు అంటున్నారు. ఇక దళిత బంధు పథకంలో లబ్ధిదారుల నుంచి 30 శాతం కు పైగా వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. డబుల్ బెడ్ రూం ఇళ్లు, గృహలక్ష్మి పథకాలు బొల్లం అనుచరులకు తప్ప వేరేవాళ్లకు రావడంలేదట.
Priyanka Gandhi Vadra: తెలంగాణకు ప్రియాంకా గాంధీ.. శుక్ర, శని వారాల్లో పర్యటన
రెవెన్యూ అధికారుల పరిస్థితి కూడా ఇలాగే ఉండడంతో కీలక విభాగాలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు ఎమ్మెల్యే వైఖరితో తలలు పట్టుకునే పరిస్థితి వచ్చిందట. మొత్తంగా సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలేసి.. అవినీతి, అక్రమాల్లో బొల్లం తన మార్క్ చూపిస్తున్నారని అంటున్నారు. ఇవన్నీ చేశాక ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు ఎలా అడగాలని కోదాడ బీఆర్‌ఎస్ కేడర్ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారట. మరి కోదాడ ఓటర్లు ఈ సారి ఏం డిసైడ్ చేస్తారో చూడాలి.