అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. పవర్‌లో ఉన్నాం కదా అని ఎగిరెగిరి పడితే.. పవర్ కోల్పోయిన తరువాత బతుకు తలకిందులు ఐపోతుంది. ఈ విషయంలో రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కు ఇప్పుడే క్లారిటీ వచ్చినట్టుంది. మొన్నటి వరకూ చంపేస్తా.. నరికేస్తా అని ఎగిరిన ఈ తోపు.. ఇప్పుడు పోలీసుల ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. వైసీపీ నేతలు ప్రోత్సహిస్తేనే తాను పవన్ కళ్యాణ్‌ను, టీడీపీ నేతలను తిట్టానని చెప్పాడు. పార్టీ కోసం ఇంత చేస్తే తనను పరామర్శించేందుకు ఒక్కరు కూడా రావడంలేదని.. తాను అప్రూవర్‌గా మారిపోతానని చెప్పాడట అనిల్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్ కూమార్ ఏ రేంజ్‌లో రెచ్చిపోయాడో సపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. మీడియాలో చూపించడానికి, మాటల్లో చెప్పడానికి కూడా వీలు లేనంత అసభ్యంగా పవన్‌ను, చంద్రబాబును, లోకేష్‌ను తిట్టాడు.
ఇలా ఒక్కసారి కాదు.. వాళ్లను విమర్శించాల్సి వచ్చిన ప్రతీసారి ఇదే తంతు. ఇంటర్వ్యూలలో డైలాగులు కొట్టడం, జగన్ ఆర్డర్ ఇస్తే చంద్రబాబును చంపేస్తానంటూ బెదిరించడం ఇదంతా ఓ హీరోయిజంగా ఫీలయ్యాడు. కట్ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మారిపోయింది. ఎవరినైతే చంపేస్తానన్నాడో, ఎవరి ఫ్యామిలీ గురించి బూతులు తిట్టాడో ఇప్పుడు వాళ్లే సీఎం, డిప్యుటీ సీఎం హోదాలో ఉన్నారు. అంతే.. కలుగులో దాక్కున్న అనిల్‌ను ఎలుకను పట్టినట్టు పట్టి లోపలేశారు పోలీసులు. మొన్నటి వరకూ ఎవరు అనిల్‌ను రెచ్చగొట్టి ఇదంతా చేయించారో వాళ్లెవరు ఇప్పుడు అనిల్ మొహం కూడా చూడటంలేదు. అసలు అరెస్ట్ గురించి వైసీపీ నుంచి ఒక్క రియాక్షన్ కూడా లేదు. దీంతో కడుపులో ఉన్న బాధ మొత్తం పోలీసుల ముందు కక్కేశాడు అనిల్. నాటి మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆయన సోదరుడితో పాటు గుంటూరు వైసీపీ అధ్యక్షుడు అప్పిరెడ్డి ఆదేశాలతోనే తాను అలా చేశానని ఒప్పుడుకున్నాడు. వాళ్లే తనను ప్రోత్సహించి టీడీపీ నేతలను తిట్టించారని ఒప్పుకున్నాడు. దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వైసీపీలో మంచి ఫ్యూచర్ ఉంటుందని నమ్మించి తనను వాడుకున్నారని చెప్తున్నాడు. తాను సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు ప్రయశ్చితంగా చంద్రబాబు, పవన్, లోకేష్‌ల అభిమానుల కాళ్లు పట్టుకునేందుకు కూడా తాను సిద్దంగా ఉన్నానని చెప్పాడట అనిల్. మరి ప్రభుత్వం అనిల్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.