వైసీపీ అధినేత జగన్ అభిమానిని అంటూ… వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పచ్చి బూతులు తిట్టిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనీల్ కు పోలీసులు షాక్ ఇస్తున్నారు. గొంతెమ్మ కోర్కెలు కోరుతూ డిమాండ్ లు చేస్తున్న అనీల్ కు తమ మార్క్ ట్రీట్మెంట్ తో విచారణ కంటిన్యూ చేస్తున్నారు. నాకు బిర్యానీ తినాలని ఉంది… తెప్పించండి. లేదా ఇంటి నుంచైనా ఆహారం తెప్పించండని పోలీస్ కస్టడీలో ఉన్న అనీల్ డిమాండ్ చేస్తే… పోలీసులు అంత సీన్ లేదని… లోకల్ మెస్ నుంచి వచ్చే భోజనమే తినాలని చెప్పారు.
మంగళవారం బోరుగడ్డ అనిల్ ను పోలీసులు కోర్ట్ లో హాజరు పరిచిన సమయంలో బిర్యాని పెట్టకపోవడాన్ని ఫిర్యాదు చేసారు. నాకు మట్టి గడ్డలు, రాళ్లు ఉన్న అన్నం పెట్టారని… ఫిర్యాదు చేయగా… కోర్ట్ కు అదే స్థాయిలో రిప్లై ఇచ్చింది. మేము కూడా అదే తింటున్నాం అని సమాధానం చెప్పారు న్యాయమూర్తి. అనిల్‌ను ఓ కేసులో కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించిన నేపధ్యంలో ఆది, సోమవారాల్లో అరండల్‌పేట పోలీస్ స్టేషన్ లో విచారించిన పోలీసులు… గడువు ముగిసిన తర్వాత… గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరిక్షలు నిర్వహించి… కోర్ట్ మళ్ళీ రిమాండ్ విధించడంతో అనిల్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరిక్షల సందర్భంగా అనీల్ మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసాడు. తన వ్యక్తిత్వ హననం జరిగిందని మీడియా ముందు వాపోవడం చూసి చాలా మంది షాక్ అయ్యారు. అనీల్ గతాన్ని మర్చిపోయి ఉండవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విచారణలో కూడా ఇలాగే కామెంట్స్ చేయగా… నువ్వు ఇతర జిల్లాలకు వెళ్లి బోరుగడ్డ అనిల్ అనే పేరు గురించి ఎవరినైనా అడిగితే వారు ఎలాంటి కామెంట్ చేస్తారో ఒకసారి విను అంటూ పోలీసులు సలహా ఇవ్వగా… మీడియా సంస్థలు కావాలనే తనను టార్గెట్ చేస్తున్నాయని… మీడియా సంస్థలకు తాను జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ద్వారానే సమాధానం చెప్తానని వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
ఇదంతా రాజకీయ కక్షని, తాను జగన్ అన్నకు సానుభూతిపరుడుగా ఉన్నాననే తనను జగన్ అన్న మనిషినని కావాలనే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డాడు. ఇప్పటికే ఫిర్యాదు కూడా చేసాడట అనీల్. ఇక పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఉద్దేశపూర్వకంగానే అనీల్ తప్పుడు సమాధానం చెప్పాడని పోలీసులు గుర్తించారు. కనీసం ఫోన్ నెంబర్ కూడా తనకు తెలియదని చెప్పడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ప్రాధమిక అంశాల్లో కూడా కావాలనే అబద్దాలు చెప్పాడని నివేదిక సిద్దం చేసారు. కాగా అనీల్ పై మొత్తం 20 కేసులు నమోదు అయినట్టు సమాచారం. బోరుగడ్డపై శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ పలు కేసులు నమోదైనట్లు సమాచారం.