జగన్ కు బొత్స ఫీవర్, కంగారులో వైసీపీ చీఫ్…?

స్వతంత్ర అభ్యర్ధి ఉన్నా కూడా ఆయనతో పెద్దగా బొత్సకు తలనొప్పి లేదు. ఇప్పుడు బొత్స శాసన మండలిలో అడుగు పెడుతున్నారు. అభ్యర్ధిని ప్రకటించడం మాత్రమే జగన్ చేసింది. కాని తన గెలుపుకు తానే బాటలు వేసుకుని బొత్సా గెలుస్తున్నారు.

  • Written By:
  • Publish Date - August 19, 2024 / 11:45 AM IST

సుదీర్ఘ కాలం రాజకీయ అనుభవం ఉన్న నాయకులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. నువ్వు పార్టీ అధినేత అయినా, ముఖ్యమంత్రి అయినా ఇంకొకటి అయినా, నీ లెక్కలు నీకు ఉంటే వాళ్ళ ప్లానింగ్ వాళ్లకు ఉంటుంది. ఇది జరిగే ఛాన్స్ లేదని నువ్వు అనుకుంటే అది అమాయకత్వం. ఇప్పుడు వైసీపీ చీఫ్ జగన్ పరిస్థితి అక్షరాలా ఇదే. ఓడిపోయే సీటుకు అభ్యర్ధి బొత్సా సత్యనారాయణ అనుకుంటూ… ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆయన్ను అభ్యర్ధిగా ప్రకటించారు. కూటమి కచ్చితంగా ఆ సీటు వదులుకోదు అని జగన్ లెక్కలు వేసారు.

ముందు ఒక అభ్యర్ధిని కూడా టీడీపీ ప్రకటించింది. కానీ, కానీ, కానీ పోటీ నుంచి మేము తప్పుకుంటున్నాం అంటూ తర్వాతి రోజే ప్రకటన చేసింది. దీనితో బొత్సా గెలుపు లాంచనం అయిపొయింది. స్వతంత్ర అభ్యర్ధి ఉన్నా కూడా ఆయనతో పెద్దగా బొత్సకు తలనొప్పి లేదు. ఇప్పుడు బొత్స శాసన మండలిలో అడుగు పెడుతున్నారు. అభ్యర్ధిని ప్రకటించడం మాత్రమే జగన్ చేసింది. కాని తన గెలుపుకు తానే బాటలు వేసుకుని బొత్సా గెలుస్తున్నారు. రేపు ఆయన మండలిలో అడుగు పెట్టడం, ఆయనకు కేబినేట్ హోదా దక్కడం అన్నీ లాంచనం.

జగన్ కు లేని ప్రతిపక్ష హోదా మండలిలో బొత్సాకు దక్కుతుంది. అక్కడి వరకు బాగానే ఉంది గాని మాస్టారూ… ఇప్పుడు మండలిలో ఎమ్మెల్సీలను బొత్సా ఎలా ప్రభావితం చేస్తారనేదే జగన్ కు కంటి మీద కునుకు లేకుండా చేసే అంశం. వైసీపీ నేతలతో కంటే బొత్సకు టీడీపీ నేతలతో స్నేహం ఎక్కువ. గంటా శ్రీనివాసరావుతో ఆయన కలిసి భోజనాలు కూడా చేస్తారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ లెక్క అన్నట్టు. ఇక అశోక గజపతి రాజుని బొత్సా గురువుగా చూస్తారు. అంత కంటే ఎక్కువగానే చూస్తారు ఒక మాటలో చెప్పాలంటే.

అశోక గజపతి రాజుకు సంబంధించిన కాలేజీలోనే బొత్సా చదువుకున్నది. అందుకే అప్పట్లో అశోక్ ని టార్గెట్ చేసి అందరూ విమర్శలు చేస్తున్నా బొత్సా ఏం మాట్లాడేవారు కాదు. ఏదో ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడినా అవి పెద్ద లెక్కలోవి కూడా కాదు అనే చెప్పాలి. ఇప్పుడు బొత్సా ప్లానింగ్ ఏంటీ అనేది వైసీపీ నేతలకు, ముఖ్యంగా జగన్ కు అర్ధం కావడం లేదు. కూటమి సర్కార్ ప్రవేశ పెట్టబోయే బిల్లులను మండలిలో అడ్డుకోవాలని జగన్ పెద్ద ప్లాన్ ఏ వేసారు. దానికి బొత్స నుంచి సహకారం ఉండకపోవచ్చు కూడా.

కూటమి పోటీ నుంచి తప్పుకుంది అంటే కచ్చితంగా వాళ్ళ లెక్క వాళ్లకు ఉంటుంది. మరో అభ్యర్ధి అయి ఉంటే ఫోకస్ పెట్టె వాళ్ళు గెలిచే వాళ్ళు. అధికారంలో ఉన్న వాళ్లకు ఒక ఎమ్మెల్సీ సీటు గెలవడం పెద్ద మేటర్ కానే కాదు. కాబట్టి బొత్స వైసీపీ మనిషి అనడం కంటే… టీడీపీ మనిషి అనడమే మంచిదనే భావనలో రాజకీయ పరిశీలకులు ఉన్నారు. అటు చిరంజీవితో కూడా బొత్సకు మంచి సంబంధాలే ఉన్నాయి. చిరంజీవికి గత అయిదేళ్ళు బాగా గుర్తుంటుంది. కాబట్టి ఇప్పుడు బొత్స మండలిలో ఎలా బిహేవ్ చేస్తారు, ఎమ్మెల్సీలు తన మాట వింటారా బొత్సా మాట వింటారా అంటూ జగన్ కు కంటి మీద కునుకు లేకుండా పోయింది.