YSRCP LEADERS: ఏపీలో వైసీపీ సీనియర్ నేతలు కొత్త సెంటిమెంట్ అస్త్రం అందుకున్నారు. ఇవే తమకు చివరి ఎన్నికలు అంటూ జనంలోకి వెళ్తున్నారు. సీనియర్ మంత్రులు బొత్స సత్యానారాయణ, ధర్మాన ప్రసాదరావుతో పాటు కొడాలి నాని కూడా తనకు కూడా చివరి ఎన్నికలు అంటున్నారు. నిజంగా వీళ్ళు మరోసారి ఎన్నికల్లో పోటీ చేయరా.. లేకపోతే ఆ సెంటిమెంట్ వాడుకొని మరోసారి గెలవాలని ప్లానేశారా..?
geethanjali: నేనున్నా.. గీతాంజలి కూతుర్ని చూసి జగన్ ఎమోషనల్.. ఏం చేశాడంటే
వైసీపీలో సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ ఇవే తనకు చివరి ఎన్నికలు అంటున్నారు. 2024 తర్వాత తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెబుతున్నారు. 2029 ఎన్నికల నాటికి ఎన్నికల్లో నిలబడబోనని అన్నారు. వయస్సు మీద పడింది.. అందుకే మళ్ళీ పోటీ చేయబోనని చెప్పేశారు బొత్స. మరో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు కూడా.. ఇవే చివరి ఎన్నికలు అంటూనే.. ఈ ఒక్కసారి అవకాశం కల్పించాలని జనానికి విజ్ఞప్తి చేశారు. తన కొడుకు ఒత్తిడితోనే మళ్ళీ పోటీకి దిగినట్టు చెప్పారు. పార్టీని కష్టకాలంలో వదిలేశానన్న అపవాదు రావొద్దనే పోటీలో ఉన్నట్టు ధర్మాన తెలిపారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ అంటే కొడాలి నానియే. ఇప్పటికి నాలుగు సార్లు గెలిచారు. 2029లో ఎన్నికల నాటికి తాను కూడా రాజకీయాల్లో ఉండటం లేదంటున్నారు నాని. ఇప్పుడు తనకు 53 యేళ్ళు ఉన్నాయనీ.. 2029కి 58 వస్తాయనీ.. ఆ వయసులో పోటీ చేయలేనని చెప్పారు. ఇవే తనకు చివరి ఎన్నికలని కొడాలి నాని చెప్పేశారు.
పాలిటిక్స్‌లో 70,80 యేళ్ళ నాయకులు కూడా వివిధ పార్టీల్లో కొనసాగుతున్నారు. ఆ వయస్సులో కూడా టిక్కెట్లు ఇవ్వలేదని బెంగపెట్టేసుకుంటున్నారు. కానీ వైసీపీ నేతలు ఇలా వరుసపెట్టి ఇవే ఆఖరి ఎన్నికలు అని చెప్పడం ఏంటని జనం ఆశ్చర్యపోతున్నారు. సెంటిమెంట్ రగిల్చి ఓట్లు పొందడానికే ఇలా అంటున్నారా..? లేదంటే నిజంగానే 2029 నాటికి ధర్మాన, బొత్స, కొడాలి నాని పాలిటిక్స్ నుంచి తప్పుకుంటారా. టీడీపీ, జనసేన లీడర్లు మాత్రం.. మరోసారి గెలిచే అవకాశం ఆ వైసీపీకి లీడర్లకు లేదనీ.. అందుకే సెంటిమెంట్ అస్త్రం వాడుకుంటున్నారని మండిపడుతున్నారు.