బ్రేకింగ్: శ్రీవాణి ట్రస్ట్ రద్దు, తిరుమలలో రాజకీయం మాట్లాడితే కేసులు

నూతనంగా ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు... కీలక నిర్ణయాలను ప్రకటించింది. స్వయంగా బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయాలను మీడియాకు వివరించారు. శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు పునరుద్ధరించారు.

  • Written By:
  • Publish Date - November 18, 2024 / 05:49 PM IST

నూతనంగా ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు… కీలక నిర్ణయాలను ప్రకటించింది. స్వయంగా బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయాలను మీడియాకు వివరించారు. శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు పునరుద్ధరించారు. గతంలో సీఎం చంద్రబాబు గరుడ వారధిగా ప్రాజెక్టు ప్రారంభించగా… దానిని గత ప్రభుత్వం శ్రీనివాస సేతుగా పేరు మార్చగా… ఇప్పుడు మళ్ళీ గరుడ వారధిగా పేరును కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక తిరుమలలో రాజకీయాలను పూర్తిగా నిషేధించారు.

ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసారు. ఇక తిరుమలలో పని చేసే అన్యమతస్తులను వేరే చోటకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు బీఆర్ నాయుడు ప్రకటించారు. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేసి ప్రధాన ట్రస్ట్ కే నిధులు తరలించాలని నిర్ణయం తీసుకున్నట్టు బీఆర్ నాయుడు తెలిపారు. శ్రీవాణి పథకం మాత్రం కొనసాగుతుందని… నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మరింత మెరుగుపరచనున్నట్టు తెలిపారు.

ఇక వివాదాస్పదం అవుతున్న నెయ్యిపై కూడా బోర్డు చర్చించింది. లడ్డూలోని నెయ్యి నాణ్యతను మరింత పెంచాలని నిర్ణయం తీసుకుంది బోర్డు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో పని చేసే ఉద్యోగుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు 10 శాతం బోనస్ ఇవ్వాలని పాలక మండలి నిర్ణయించింది.ఇక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయం పాలక మండలి నిర్ణయించింది. పర్యాటక ఖ ద్వారా ఇచ్చే టికెట్లను రద్దు చేయాలని నిర్ణయించారు. టూరిజం శాఖ ఇచ్చే 4 వేల టికెట్ల రద్దు చేయనున్నారు.

గతంలో… టూరిజం శాఖ ఇచ్చే టికెట్లలో అవకతవకలు జరిగాయని పాలక మండలి గుర్తించింది. ఇక ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐ సహకారం సామాన్య భక్తులకు త్వరగా దర్శనం మరింత సులభతరం చేయనున్నారు. ఏళ్ల తరబడి డంపింగ్ యార్డులో పేరుకున్న చెత్తను రెండు నెలల్లో తొలగించాలని నిర్ణయించారు. స్థానికుల కోసం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతినెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం ఏర్పాటు చేయనున్నారు. వివాదాస్పదంగా మారిన శారదాపీఠం లీజు రద్దు చేసి స్థలం స్వాధీనం చేసుకుంటామని బీఆర్ నాయుడు ప్రకటించారు. ప్రసాదాల తయారీ పోటుకు మరమ్మతులు చేయాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది.