బ్రేకింగ్: సింహాచలం లడ్డుపై అనుమానాలు

ఆంధ్రప్రదేశ్ లో మరో లడ్డు ప్రసాదంపై అనుమానాలు మొదలయ్యాయి. సింహాచలం దేవాలయంలో లడ్డు నాణ్యతపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుమానాలు వ్యక్తం చేసారు.

  • Written By:
  • Updated On - September 21, 2024 / 03:28 PM IST

ఆంధ్రప్రదేశ్ లో మరో లడ్డు ప్రసాదంపై అనుమానాలు మొదలయ్యాయి. సింహాచలం దేవాలయంలో లడ్డు నాణ్యతపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుమానాలు వ్యక్తం చేసారు. లడ్డు ప్రసాదం, పులిహోర సరుకుల రికార్డులను పరిశీలించిన గంట… కీలక వ్యాఖ్యలు చేసారు. సింహాచలం లడ్డు ప్రసాదం చూస్తే కళ్ళు తిరిగిపోయే వాస్తవాలు బయటకు వచ్చాయన్నారు. లడ్డు ఎండిపోయి ప్రసాదం అన్న భావన కలవడం లేదు అన్నారు

లడ్డు ప్రసాదం, దీపాల కోసం వాడే నెయ్యి వివరాలు తెలుసుకున్న గంటా… 650 రూపాయల పైబడి ఉన్న ఆవు నెయ్యి 385 రూపాయలకి యూపీ కంపెనీ ఎలా సరఫరా చేసింది అని నిలదీశారు. 2021-22 లో 591 రూపాయలు ధర పలికిన కిలో నెయ్యి.. 22-23 లో 393లో పలకడం ఏంటి అని ప్రశ్నించారు. యూపీ కి చెందిన ప్రీమియర్ ఆగ్రోటెక్ ఫుడ్ లిమిటెడ్ 393 రూపాయలకే కిలో నెయ్యి సరఫరా చేసింది అని సింహాచలంలో ప్రసాద నాణ్యతలపై విచారణ చేస్తాం అని స్పష్టం చేసారు. గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ గాడి తప్పాయని మండిపడ్డారు.