గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ అగ్ర నేత సజ్జల రామకృష్ణా రెడ్డికి ఉచ్చు బిగుస్తోందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతోంది. సజ్జల విషయంలో ఇప్పుడు ఏపీ సర్కార్ సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయనపై పలు కేసులు కూడా పెండింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ తరుణంలో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు సంచలన వ్యాఖ్యలు చేసారు.
సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఏపీ డిజిపి ద్వారకా తిరుమల రావు… సజ్జల రామకృష్ణా రెడ్డి పై లుక్ ఔట్ నోటీసు ఉంది అన్నారు. ఒక కేసులో గుంటూరు ఎస్పీ ఎల్ ఓ సీ జారీ చేసి ఉన్నారని… ఆ కేసుకు సంబంధించి డీటెయిన్ చేసే అవకాశం ఉంది, అలా చేసి ఉండొచ్చు, పూర్తి సమాచారం లేదు అని తెలిపారు. ఇక లడ్డు వ్యవహారంపై కూడా ఆయన మాట్లాడారు. కల్తీ లడ్డూ కేసులో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వ సిట్ ను అభిసంశించలేదన్నారు.
ఈ సిట్ నే ఇద్దరు సీబీఐ, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు, ఒక fssai అధికారి తో సబ్స్టిట్యూట్ చేసారు అని తెలిపారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఐజీ త్రిపాఠి, డిఐజి జెట్టి గోపినాథ్ ల పేర్లను పంపించామన్నారు. అది స్వతంత్ర విచారణ కావడంతో అందులో రాష్ట్ర పోలీసు జోక్యం ఉండదు అని స్పష్టం చేసారు.