బ్రేకింగ్: తెలంగాణాలో మయోనైజ్‌ బ్యాన్

మయోనైజ్‌పై బ్యాన్ విధించాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో సమీక్ష లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • Written By:
  • Publish Date - October 30, 2024 / 06:38 PM IST

మయోనైజ్‌పై బ్యాన్ విధించాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో సమీక్ష లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉత్తర్వులు విడుదల చేయనున్నారు. హోటళ్లలో తనిఖీలు, నియంత్రణ కోసం నియమించిన టాస్క్ ఫోర్స్‌‌ కమిటీల పనితీరును ఆరా తీసిన మంత్రి.. పలు విషయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

వివిధ రకాల ఆహార పదార్థాలతో కలిపి తినే మయోనైజ్‌ను కల్తీ గుడ్లు… ఉడకబెట్టని గుడ్లుతో తయారు చేస్తున్నారని, దానివల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని మంత్రికి అధికారులు వివరించారు. కేరళలో మయోనైజ్‌పై బ్యాన్ విధించిన విషయాన్ని మంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రంలోనూ బ్యాన్ విధించాలని అధికారులు మంత్రిని కోరగా… వెంటనే నిర్ణయం తీసుకున్నారు.