సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మపై కేసు నమోదు చేసారు ఏపీ పోలీసులు. రామ్గోపాల్ వర్మపై మద్దిపాడు పోలీసు స్టేషన్లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్ల సమయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు చేశారని ఆయనపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేసారు. తెదేపా మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు.
ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలను పెద్ద ఎత్తున అదుపులోకి తీసుకుంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఇంచార్జ్ అర్జున్ రెడ్డి, సోషల్ మీడియా బాధ్యతలు చూసే సజ్జల భార్గవ రెడ్డి సహా పలువురిపై కేసులు నమోదు చేసారు. వర్రా, ఇంటూరి సహా పలువురు వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.