బ్రేకింగ్: లడ్డుపై సుప్రీం కీలక ఆదేశాలు

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది కోర్ట్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కొత్త సిట్ ఏర్పాటు చేసింది.

  • Written By:
  • Publish Date - October 4, 2024 / 12:26 PM IST

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది కోర్ట్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కొత్త సిట్ ఏర్పాటు చేసింది. కొత్త సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు ఉంటారు. రాష్ట్ర సర్కార్ నుంచి ఇద్దరు పోలీస్‌ అధికారులు ఉంటారని తెలిపింది కోర్ట్. సీనియర్‌ ఫుడ్‌ సేఫ్టీ అధికారితో స్వతంత్ర దర్యాప్తు చేయాలని ఆదేశించింది.

సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్ సూద్‌ పర్యవేక్షణలో సిట్ విచారణ జరగనుంది. కేంద్రానికి కొత్త సిట్‌ బృందం నివేదిక ఇస్తుంది. స్వతంత్ర దర్యాప్తు సంస్థపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై రాజకీయ డ్రామాలు వద్దని స్పష్టం చేసింది కోర్ట్. స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే.. రాజకీయ జోక్యం ఉండదని అభిప్రాయపడింది కోర్ట్.