బ్రేకింగ్: తిరుమల లడ్డుపై ఆగిపోయిన విచారణ

తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో సుప్రీం కోర్ట్ సంధించిన ప్రశ్నలు సంచలనంగా మారాయి.

  • Written By:
  • Publish Date - October 1, 2024 / 02:19 PM IST

తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో సుప్రీం కోర్ట్ సంధించిన ప్రశ్నలు సంచలనంగా మారాయి. ఇక సుప్రీం కోర్ట్ లో విచారణ నేపధ్యంలో సిట్ విచారణకు బ్రేక్ పడింది. నేటితో సిట్ మొదటి దశ విచారణ ముగిసింది. నాలుగు రోజులు పాటు జరిగిన విచారణపై డీజీపీకి ఐజీ త్రిపాఠి, డీఐజీ గోపినాథ్ జెట్టి వివరించారు.

అనంతరం తిరుమల నుంచి సిట్ బృందం బయల్దేరింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు తదుపరి విచారణ ఉండే అవకాశం కనపడుతోంది. దీనిపై డీజీపీ ద్వారకా తిరుమల రావు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ నెల 3వ తేదీ వరకు సిట్‌ దర్యాప్తు ఆపుతున్నామని తెలిపారు. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండటం వల్ల దర్యాప్తు ఆపుతున్నాం అన్నారు. కేసు తీవ్రత వల్లే సిట్‌ వేశామన్నారు. ఈ నెల 3న సుప్రీం ఇచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి దర్యాప్తు ఉంటుందని పేర్కొన్నారు.