BRS: బీఆర్ఎస్‌కు నామినేషన్‌ విత్‌డ్రా టెన్షన్‌.. ఎవరితో.. ఎందుకు..?

ఫైనల్‌గా ఎంపీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నామనుకునే వేళ.. కారు పార్టీని కొత్త టెన్షన్ వెంటాడుతోంది. లోక్‌సభ అభ్యర్థులు ఎక్కడ నామినేషన్లు విత్‌డ్రా చేసుకుంటారేమో అనే భయం కనిపిస్తోంది. తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది.

  • Written By:
  • Updated On - April 25, 2024 / 07:57 PM IST

BRS: బీఆర్ఎస్ టైమ్ అసలు బాగోలేదు. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయినట్లు ఉంది సీన్. అధికారం కోల్పోయినప్పటి నుంచి.. దెబ్బ మీద దెబ్బ.. ఒకదాని తర్వాత ఒకటి.. షాక్‌ల ఎఫెక్ట్‌కు కారు కుదేలవుతోంది. ఎంపీలుగా పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరక్క అవస్థలు పడ్డారంటే.. ఎంపీ అభ్యర్థులుగా అనౌన్స్ చేసిన తర్వాత కొందరు జంప్ జిలానీ అనేశారు. ఫైనల్‌గా ఎంపీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నామనుకునే వేళ.. కారు పార్టీని కొత్త టెన్షన్ వెంటాడుతోంది.

MADHAVI LATHA: హైదరాబాద్‌ శివంగి.. మాధవీలత ఆస్తులు ఎన్ని అంటే..

లోక్‌సభ అభ్యర్థులు ఎక్కడ నామినేషన్లు విత్‌డ్రా చేసుకుంటారేమో అనే భయం కనిపిస్తోంది. తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. విత్‌డ్రాకు ఇంకాస్త టైమ్ ఉంది. ఈలోపు ఎలాంటి ప్రమాదం జరగకుండా.. కేసీఆర్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు లోక్‌సభ అభ్యర్థులు నామినేషన్లు.. వెనక్కి తీసుకునే చాన్స్ ఉందని కేసీఆర్‌కు సమాచారం అందింది. దీంతో మరింత అలర్ట్ అయ్యారు. గుజరాత్‌లో ఇలానే జరిగింది. నామినేషన్ అభ్యర్థులు చివరి నిమిషంలో విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా నెగ్గారు. తెలంగాణలోనూ అలాంటి పరిస్థితే ఉందని.. కేసీఆర్‌కు సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. కొందరు బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్‌ వెనక్కి తీసుకునేలా తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నాయని.. తెలుస్తోంది.

దీంతో పార్టీ అభ్యర్థులపై బీఆర్ఎస్ అధిష్టానం నిఘా పెట్టింది. నామినేషన్లు వెనక్కి తీసుకోకుండా ఎప్పటికప్పుడు గమనిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకుంటే.. కారు పార్టీకి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. చాలాచోట్ల ఫేస్ టు ఫేస్ ఎలక్షన్‌ ఫైట్ జరిగే అవకాశం ఉంటుంది. పైగా బీఆర్ఎస్ ఓట్లు గంపగుత్తగా ఏదో ఒక పార్టీకి పడే చాన్స్ ఉంటుంది. అదే జరిగితే.. బీఆర్ఎస్‌ మరో ఝలక్ తగిలే అవకాశాలు ఉంటాయ్.